breaking news
samineni
-
కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతోంది: కవిత
ఖమ్మం జిల్లా: పాతర్లపాడులో సిపిఎం నేత సామినేని రామారావు కుటుంబాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కవిత పరామర్శించింది. ఇటీవల సామినేని రామారావు కుటుంబంలో జరిగిన విషాదం నేపథ్యంలో కవిత అక్కడికి వెళ్లి బాధితులను ఓదార్చింది. అనంతరం కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతోందని, జరిగిన హత్యపై నిష్పక్షపాత విచారణ జరిపి.. హంతకులను వెంటనే అరెస్టు చేయాలని కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులకు బెదిరించడం, భయపెట్టడం అలవాటని కవిత విమర్శించారు. రాష్ట్రస్థాయిలో రామారావు హత్యపై పోరాడేందుకు అండగా ఉంటానని కవిత హామీ ఇచ్చారు. ఈ ఘటనపై డీజీపీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రస్థాయిలో రామారావు హత్యపై పోరాడేందుకు అండగా ఉంటానని కవిత హామీ ఇచ్చారు. -
ఖమ్మంలో సీపీఎం నేత హత్య
సాక్షి, ఖమ్మం: సీపీఎం నాయకుడు సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యారు. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో ఘటన జరిగింది. ఉదయం ఇంట్లో వాకింగ్ చేస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు వచ్చి గొంతు కోసి హత్య చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే హత్య జరిగిందని గ్రామస్థులు అంటున్నారు. సామినేని రామారావు సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని రామారావు పని చేశారుసామినేని రామారావు హత్యపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. దోషులను చట్టపరంగా శిక్షిస్తామని.. కలుషిత హింస రాజకీయాలకు తావులేదని భట్టి అన్నారు. క్లూస్ టీం, సైబర్ టీం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. -
25 నుంచి షర్మిల పర్యటన
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ సోదరి షర్మిల ఈ నెల 25 నుంచి మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. 25న సాయంత్రం జిల్లాకు చేరుకుని తొలిరోజు ఉయ్యూరు, పెడనలో ప్రచారం నిర్వహిస్తారు. 26న నూజివీడు, తిరువూరు, నందిగామ, 27న జగ్గయ్యపేట, విజయవాడలో పర్యటిస్తారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ ఈ విషయం వెల్లడించారు.


