ఖమ్మం జిల్లా: పాతర్లపాడులో సిపిఎం నేత సామినేని రామారావు కుటుంబాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కవిత పరామర్శించింది. ఇటీవల సామినేని రామారావు కుటుంబంలో జరిగిన విషాదం నేపథ్యంలో కవిత అక్కడికి వెళ్లి బాధితులను ఓదార్చింది. అనంతరం కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతోందని, జరిగిన హత్యపై నిష్పక్షపాత విచారణ జరిపి.. హంతకులను వెంటనే అరెస్టు చేయాలని కవిత డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నాయకులకు బెదిరించడం, భయపెట్టడం అలవాటని కవిత విమర్శించారు. రాష్ట్రస్థాయిలో రామారావు హత్యపై పోరాడేందుకు అండగా ఉంటానని కవిత హామీ ఇచ్చారు. ఈ ఘటనపై డీజీపీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రస్థాయిలో రామారావు హత్యపై పోరాడేందుకు అండగా ఉంటానని కవిత హామీ ఇచ్చారు.


