ఈసారి అంతకు మించి!
మొదటి విడతతో పోలిస్తే 1.13 శాతం అదనం ఖమ్మం రూరల్ మండలంలో అత్యధికంగా 93.76 శాతం ఉదయం నుంచే కేంద్రాల వద్దకు పోటెత్తిన ఓటర్లు
మండలాల వారీగా మొత్తం ఓటర్లు, పోలైన ఓట్లు, శాతం
పోలింగ్ శాతం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. జిల్లాలోని కామేపల్లి, ఖమ్మంరూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లో ఆదివారం ఎన్నికలు జరగగా, ఉదయం 7గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు దీరారు. దీంతో పోలింగ్ ముగిసే సమయానికి 91.21 శాతంగా నమోదైంది. మొదటి విడతతో పోలిస్తే ఇది 1.13 శాతం అదనం కావడం విశేషం. తొలి విడత ఎన్నికల్లో 90.08 శాతంతో రాష్ట్రంలో జిల్లా నాలుగో స్థానంలో నిలవగా.. ఇప్పుడు రెండో స్థానానికి ఎగబాకింది. యాదాద్రి భువనగిరి జిల్లా 91.72 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది.
బారులు దీరిన ఓటర్లు
పోలింగ్ ప్రారంభం నుంచే ఓటర్లు కేంద్రాలకు తరలివచ్చారు. ఆరు మండలాల్లోని దాదాపు అన్ని కేంద్రాల వద్ద ఇదే దృశ్యం కనిపించింది. అభ్యర్థులు ఓటర్లను పోలింగ్‌కేంద్రాలకు తరలించారు. ఇంకొందరు వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు కుటుంబీకుల సాయంతో వచ్చారు. రెండో విడతలో మొత్తం 183 గ్రామపంచాయతీలు, 1,686 వార్డుల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 23 జీపీలు, 306 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇంకో వార్డుకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 160 గ్రామపంచాయతీలు, 1,379 వార్డుల్లో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు.
పోలింగ్ పర్యవేక్షణ
రెండో విడత పోలింగ్ తీరును కలెక్టరేట్‌లోని మానిటరింగ్ సెల్ నుంచి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పర్యవేక్షించారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారికి టోకెన్లు ఇచ్చి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుధామారావు ముదిగొండ, నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మంరూరల్ మండలాల్లో, కామేపల్లి మండలం ముచ్చర్లలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ పరిశీలించారు.
గంటగంటకూ పెరిగిన పోలింగ్
మొదటి విడత మాదిరిగానే రెండో విడత ఎన్నికల్లోనూ పోలింగ్ జోరు కొనసాగింది. మొత్తం 2,48,239 మంది ఓటర్లకు 2,26,417 మంది ఓటు వేశారు. ఇందులో 1,12,160 మంది పురుషులు, 1,14,252 మంది మహిళలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో అత్యధికంగా 93.76 శాతం పోలింగ్ నమోదు కాగా, ఇక్కడ 33,851 మంది ఓటర్లకు 31,739 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
బందోబస్తు నడుమ
పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. దాదాపు 2వేల మంది పోలీసులు పహారా కాశారు. క్రిటికల్ స్టేషన్ల వద్ద అదనపు బలగాలను మోహరించారు. ఆరు మండలాల పరిధి 304 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అడిషనల్ డీసీపీ పర్యవేక్షణలో బలగాలతో పాటు ప్రత్యేక బృందాలను నియమించారు. ఖమ్మం రూరల్, కామంచికల్, తీర్థాల, గోళ్లపాడు, ముదిగొండ, నేలకొండపల్లి, ముజ్జుగూడెం, రాజేశ్వరపురం, కూసుమంచి, జల్లేపల్లి, దమ్మాయిగూడెం, తిరుమలాయపాలెం గ్రామాల్లో కేంద్రాలను పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ పరిశీలించారు.
కూసుమంచిలో మొదటిసారి ఓటు వేసిన ఆనందంలో యువతి
బ్యాలెట్ బాక్స్‌లో ఓటు వేస్తున్న యువతి
రికార్డు స్థాయిలో 91.21శాతం పోలింగ్
మండలం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు పోలింగ్ శాతం
కామేపల్లి 30,349 26,414 87.03
ఖమ్మంరూరల్ 33,851 31,739 93.76
కూసుమంచి 45,420 41,298 90.92
ముదిగొండ 43,877 40,155 91.52
నేలకొండపల్లి 47,420 43,480 91.69
తిరుమలాయపాలెం 47,322 43,331 91.57
మొత్తం 2,48,239 2,26.417 91.21
ఈసారి అంతకు మించి!
ఈసారి అంతకు మించి!
ఈసారి అంతకు మించి!
ఈసారి అంతకు మించి!
ఈసారి అంతకు మించి!
ఈసారి అంతకు మించి!
ఈసారి అంతకు మించి!


