సదా.. మీ సేవలో ! | - | Sakshi
Sakshi News home page

సదా.. మీ సేవలో !

Mar 12 2026 7:41 AM | Updated on Mar 12 2026 7:41 AM

● విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి వాట్సాప్‌ చాట్‌బాట్‌ ● అందుబాటులోకి 79016 28348 నంబర్‌ ● ఇంటి నుంచే ఫిర్యాదులకు అవకాశం

సమస్యలకు సత్వర పరిష్కారం

● విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి వాట్సాప్‌ చాట్‌బాట్‌ ● అందుబాటులోకి 79016 28348 నంబర్‌ ● ఇంటి నుంచే ఫిర్యాదులకు అవకాశం

ఖమ్మంవ్యవసాయం: విద్యుత్‌ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా ఎన్పీడీసీఎల్‌ అధికారులు సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. ఇందులో భాగంగా సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు కార్యాలయాలు, సబ్‌స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సెల్‌ఫోన్‌ నుంచే నమోదు చేయడంతో పాటు స్థితిగతులు తెలుసుకునే అవకాశం కల్పించారు. ఈమేరకు వాట్సాప్‌ చాట్‌బాట్‌ ద్వారా ఫిర్యాదు చేసే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.

ఫిర్యాదు నమోదు చేసే విధానం

వినియోగదారులు తమ ఫోన్‌ నుంచి 79016 28348 నంబర్‌కు వాట్సాప్‌లో ‘ఏఐ’ అని మెసేజ్‌ పంపాలి. ఆ వెంటనే ‘హాయ్‌.. ఎన్పీడీసీఎల్‌ కాల్‌సెంటర్‌కు స్వాగతం’ అనే సందేశంతో పాటు రిజిస్టర్‌ కంప్‌లైంట్‌, ట్రాక్‌ కంప్‌లైంట్‌, చాట్‌ విత్‌ ఏజెంట్‌ అనే ఆప్షన్లు వస్తాయి. అందులో రిజిస్టర్‌ కంప్‌లైంట్‌ ఎంచుకుంటే విద్యుత్‌ కనెక్షన్‌ నంబర్‌ వివరాలతో లేదా ఆ వివరాలు లేకుండా కూడా ఫిర్యాదు చేయొచ్చు. సర్వీస్‌ నంబర్‌ నమోదు చేశాక వినియోగదారుల వివరాలు కనిపిస్తాయి. అంతా సరిగ్గా ఉందని నిర్ధారించుకున్నాక మెనూలో సమస్య రకాన్ని ఎంచుకుని ముందుకు సాగాలి

త్వరగా పరిష్కారం, పారదర్శకత

ఫిర్యాదు నమోదు చేయగానే ఒక నంబర్‌ కేటాయిస్తారు. అంతేకాక ఫిర్యాదు సమాచారం సంబంధిత అధికారికి వెళ్తుంది. సమస్యను పరిష్కరించాక వినియోగదారులకు మెసేజ్‌ పంపడమే కాక ఐవీఆర్‌ఎస్‌ ద్వారా కాల్‌ సెంటర్‌ నుంచి నిర్ధారించుకుంటారు. ఒకవేళ పరిష్కారంపై సంతప్తి చెందకపోతే తిరిగి ఫిర్యాదు చేయడం లేదా ఫీడ్‌ బ్యాక్‌ ఇచ్చే సౌకర్యం కూడా కల్పించారు.

వెబ్‌సైట్‌లోనూ...

వినియోగదారులు ఎన్పీడీసీఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌ www. tgnpdcl. comలోని వాట్సాప్‌ ఐకాన్‌ క్లిక్‌ చేసి కూడా ఈ సేవలు పొందవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో టోల్‌ ఫ్రీ నంబర్‌ 1912ను సంప్రదించే అవకాశముంది.

విద్యుత్‌ సమస్యల సత్వర పరిష్కారానికి వాట్సాప్‌ చాట్‌బాట్‌ దోహదపడుతుంది. దీని ద్వారా వినియోగదారులు ఎక్కడకు వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లో నుంచే సెల్‌ఫోన్‌ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

– ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్‌ఈ, ఖమ్మం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement