నేలకొండపల్లి: అనంతనగర్ – నేలకొండపల్లి గ్రామా ల మధ్య మూలమలుపు వద్ద గత శుక్రవారం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి అభి నయ్ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మండలంలోని అనంతనగర్ సమీపంలో ఈ నెల 6వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కోరట్లగూడెంనకు చెందిన బచ్చలకూరి అభినయ్ (19) నేలకొండపల్లి ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. పరీక్షరాసి ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరగా.. ఖమ్మంలోని ఓ ప్రవేట్ వైద్యశాలకు తరలించారు. బుధవారం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదుచేశారు. మృతదేహాన్ని రాష్ట్రగిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల అంజిని, కడియాల నరేశ్ సందర్శించి నివాళులర్పించారు.
రోడ్డు ప్రమాదంలో యువతి..
మధిర: రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందిన ఘటన బుధవారం ఇల్లెందులపాడు సమీపంలోని మాత కోల్డ్ స్టోరే జ్ వద్ద చోటుచేసుకుంది. మధిర పట్టణానికి చెందిన స్వర్గం శ్రీనివాసరావు, రాణి దంపతులు దెందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. పాఠశాలకు ప్రతీరోజు బైక్ లేదా కారులో వెళ్లి వస్తుంటారు. శ్రీనివాసరావుకు వేరే పని ఉండటంతో తల్లిని తీసుకురమ్మని.. పెద్దకుమార్తె శరణ్య (21)కు చెప్పాడు. ఆమె మధిర నుంచి దెందుకూరు పాఠశాలకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా రాయపట్నం గ్రామానికి చెందిన కృష్ణ తన టాటా ఏస్ వాహనంతో మాత కోల్డ్ స్టోరేజీ వద్ద ఢీకొట్టాడు. దీంతో శరణ్య అక్కడికక్కడే మతి చెందింది. టౌన్ పోలీసులు చేరుకుని, మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతురాలు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది.
బాణాపురం సమీపంలో యువకుడు..
ముదిగొండ: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన మండలంలోని బాణాపురం సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఏపీలోని జగ్గయ్యపేట మండలం గండ్రాయికి చెందిన నగరి శ్రీనివాస్ (25) ట్రాక్టర్‌పై కూర్చుని వస్తున్నాడు. అతివేగంగా, నిర్లక్ష్యంగాడ్రైవర్ పల్లెబోయిననరసింహారావు ట్రాక్టర్‌ను నడపడంతో శ్రీనివాస్ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన్ను జగ్గయ్యపేట ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేర కు ముదిగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ ..
ఖమ్మంక్రైం: నగరంలోని త్రీటౌన్ పరిధిలో బుధవారం అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతిచైందింది. సీఐ మోహన్‌బాబు కథనం ప్రకారం.. నక్కా వెంకటరమణ (33) అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఆమె భర్త మల్లేశ్ గత నెల 9వ తేదీన ప్రమాదవశాత్తు మృతిచెందాడు. దీంతో ఆమె ఖమ్మంలోని శ్రీనివాసర్‌నగర్ ప్రాంతంలో ఉంటున్న ఆమె తండ్రి వంగూరి సైదులు ఇంటికి వచ్చింది. మంచంపై మృతి చెంది ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. కాగా, తన అక్క మృతిపై అనుమానం ఉందని ఆమె సోదరుడు వెంకటేశ్ ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు అన్నం శ్రీనివాసరావు సాయంతో మార్చురికి తరలించారు.


