విద్యార్థిగా మారిన మావోయిస్టు మాజీ అగ్రనేత | Ex Maoist Leader Devji Wrote His Inter Exam In Korutla | Sakshi
Sakshi News home page

విద్యార్థిగా మారిన మావోయిస్టు మాజీ అగ్రనేత

May 13 2026 4:22 PM | Updated on May 13 2026 7:56 PM

Ex Maoist Leader Devji Wrote His Inter Exam In Korutla

సాక్షి, జగిత్యాల జిల్లా: మావోయిస్టు మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ విద్యార్థిగా మారిపోయారు. కోరుట్లలో నాలుగు దశాబ్దాల అనంతరం ఇవాళ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష రాశారు. ఇంటర్ సెకండ్ ఇయర్ అన్ని పరీక్షలు పాసైనా.. తెలుగు పరీక్ష  తప్పిన దేవ్ జీ.. 1984- 1985లో ఇంటర్ చదివే రోజుల్లో విప్లవ భావజాలానికి ఆయన ఆకర్షితుడయ్యారు.

కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రాడికల్ స్టూడెంట్‌ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసిన దేవ్ జీకి పరీక్ష రాసేందుకు ఇంటర్ బోర్డు నుంచి అనుమతి లభించింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు ఎగ్జామ్ రాశారు. లాయర్ కావాలన్న ఉద్దేశంతో మళ్లీ పరీక్ష రాసినట్లు దేవ్‌జీ తెలిపారు. పరీక్షలు పాస్ కావాలని ఆయన కొద్ది రోజులుగా తిరుపతి ప్రిపేరవుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement