వైఎ‍స్సార్‌సీపీ నేత కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ | YSRCP Chief YS Jagan Consoles Family of Deceased Leader Ramakrishna | Sakshi
Sakshi News home page

వైఎ‍స్సార్‌సీపీ నేత కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

May 16 2026 11:32 PM | Updated on May 17 2026 10:41 AM

YSRCP Chief YS Jagan Consoles Family of Deceased Leader Ramakrishna

ఏలూరు, సాక్షి: ఏలూరు జిల్లా వైఎ‍స్సార్‌సీపీ నేత యలమర్తి రామకృష్ణ కుటుంబాన్ని వైఎ‍స్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఫోన్ కాల్ ద్వారా పరామర్శించారు. దెందులూరు మండలం పెరుగు గూడెం గ్రామ వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత యలమర్తి రామకృష్ణ గతవారం జరిగన రోడ్డు ప్రమాదంలో మరణించారు.

ఈ నేపథ్యంలో యలమర్తి రామకృష్ణ కుటుంబాన్ని శనివారం ఫోన్‌లో పరామర్శించిన వైఎస్‌ జగన్‌.. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రామకృష్ణ మృతి పార్టీకి తీరని లోటని, వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కష్ట కాలంలో పార్టీ  కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement