రోడ్డు ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్‌ నేత మృతి | Khammam Congress Leader Dies In Road Accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్‌ నేత మృతి

Apr 15 2026 5:36 PM | Updated on Apr 15 2026 6:23 PM

Khammam Congress Leader Dies In Road Accident

సాక్షి, ఖమ్మం జిల్లా: రోడ్డు ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జావిద్‌ మృతి చెందారు. ఖమ్మం- హైదరాబాద్ జాతీయ రహదారిపై పిల్లలమర్రి శివారులో ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జావీద్‌ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న రూరల్‌ పోలీసులు..  రూరల్ మృతదేహాన్ని సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు.

భట్టి విక్రమార్క దిగ్బ్రాంతి
జావిద్ మృతి పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి జావిద్ అందించిన సేవలు మరువలేవన్నారు. జావిద్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. గత పది సంవత్సరాల పాటు పార్టీ కష్టకాలంలో ముందుండి జావిద్ సేవలు అందించారని గుర్తు చేశారు. 

ఖమ్మం నగర కార్పొరేషన్ మాజీ అధ్యక్షునిగా, ప్రస్తుతం పిసిసి కార్యవర్గ సభ్యునిగా, రాజీవ్ గాంధీ పంచాయతీ అభియాన్ కమిటీలో కీలక నేతగా, సేవాదళ్ రాష్ట్ర నాయకునిగా సుదీర్ఘకాలం పార్టీకి ఆయన అందించిన సేవలు మరువలేనివి అన్నారు. మహమ్మద్ జావిద్ కుటుంబానికి యావత్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. జావిద్ కుటుంబానికి ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం తన సానుభూతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement