‘లీడర్‌’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌ | Leader Movie Review And Rating In Telugu, Spy-Action Thriller Packed With Twists And Emotional Drama | Sakshi
Sakshi News home page

Leader Movie Review : ‘లీడర్‌’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Apr 4 2026 5:32 PM | Updated on Apr 4 2026 6:02 PM

Leader Movie Review And Rating In Telugu

టైటిల్‌ : లీడర్‌
నటీనటులు:శరవణన్, పాయల్ రాజ్ పుత్, శ్యామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్, లాల్, బాహుబలి ప్రభాకర్, అమృత అయ్యర్, వీటీవీ గణేష్, ఐశ్వర్య తదితరులు
నిర్మాణ సంస్థ: లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్
దర్శకుడు: ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్
సంగీతం: జిబ్రాన్‌
సినిమాటోగ్రఫీ: ఎస్. వెంకటేష్
ఎడిటర్‌ : ప్రదీప్‌ ఇ.రాఘవ్‌
విడుదల తేది: ఏప్రిల్‌ 3

‘ది లెజెండ్‌’(2022) తో ప్రముఖ వ్యాపారవేత్త అరుళ్‌ శరవణన్‌ హీరోగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల గ్యాప్‌ తర్వాత ఇప్పుడు ‘లీడర్‌’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? శరవణన్ ఖాతాలో హిట్‌ పడిందా లేదా రివ్యూలో చూద్దాం.

‍కథేంటంటే..
శక్తివేల్‌ (శరవణన్‌) కారు మెకానిక్‌. భార్య చనిపోతుంది. కూతురు అయిరేని(ఇయల్‌) అంటే అతనికి ప్రాణం. ఆమెకు వినికిడి లోపం ఉంటుంది. ఆమెకు ఆపరేషన్‌ చేయించే ప్రయత్నాల్లో ఉంటాడు శక్తివేల్‌ ఉండగా.. ఓ రోజు ఎస్సై ఇంద్రా సత్యమూర్తి (ఆండ్రియా) వచ్చి.. తన షెడ్డులోకి రిపేర్‌కి వచ్చే సాల్ట్‌(బాహుబలి ప్రభాకర్‌)కు చెందిన కారులో ఓ ఆడియో బగ్‌ పెట్టమని కోరుతుంది. దానికి శక్తివేల్‌ నిరాకరిస్తాడు. అయితే తన కూతురిని సాల్ట్‌ గ్యాంగ్‌ కిడ్నాప్‌ చేసిందని నమ్మించి..పోర్టులో ఉన్న పేలుడు పదార్థాల కంటెయినర్‌ని బయటకు తీసుకొచ్చేలా చేస్తుంది. 

పోలీసుల ఆధీనంలో ఉన్న ఆ కంటెయినర్‌ తిరిగి తీసుకురాకపోతే..నిజంగానే కూతురుని చంపేస్తామని సాల్ట్‌ హెచ్చరిస్తాడు. మరి కూతురుని కాపాడుకునేందుకు శక్తివేల్‌ ఏం చేశాడు? పోలీసుల ఆధీనంలో ఉన్న కంటెయినర్‌కు విదేశాల్లో ఉన్న టెర్రరిస్ట్‌ డెవిల్‌(సంతోష్‌ ప్రతాప్‌)కు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఎస్సై ఇంద్రా సత్యమూర్తి వేసిన ప్లాన్‌ ఏంటి? ఆమె అలా ప్లాన్‌ వేసేలా చెసిందెవరు? అసలు శక్తివేల్‌ గతం ఏంటి? అతని భార్య మీరా(పాయల్‌ రాజ్‌పుత్‌)ని తన చేతులతోనే ఎందుకు చంపాడు?  ట్వల్వ్‌ మెన్‌ స్క్వాడ్‌ అనే సీక్రెట్‌ రా ఏజెంట్‌కి శక్తివేల్‌తో ఉన్న సంబంధం ఏంటి? శక్తివేల్‌కి, డెవిల్‌కి మధ్య ఉన్న వైరం ఏంటి?‍ అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే.. 
తండ్రి-కూతురు ఎమోషనల్‌తో కూడిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. ఈ తరహా చిత్రాల్లో యాక్షన్‌  ఎలిమెంట్స్‌తో పాటు ట్విస్టులు  కూడా ఊహించని విధంగా ఉంటే.. ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు. లీడర్‌లో ఆ రెండు ఎలిమెంట్స్‌ ఉన్నాయి. భారీ యాక్షన్స్‌తో పాటు చిన్న చిన్న ట్విస్టులతో ఆద్యంతం ఆసక్తికరంగా కథనం సాగుతుంది.  రొటీన్‌ కథే అయినా.. స్క్రీన్‌ప్లే మాత్రం అదిరిపోయింది. 

ఫస్టాఫ్‌ అంతా తండ్రి కూతురు బాండింగ్‌తో పాటు.. ఎస్పై  ఇంద్రా సత్యమూర్తి  ఇన్వెస్టిగేషన్‌ చుట్టూనే తిరుగుతుంది. సాల్ట్‌ యార్డ్‌లో జరిగే అక్రమాలను బయట పెట్టేందుకు ఎస్సై ఇంద్ర.. శక్తివేల్‌ సాయం అడిగినప్పటి నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది.  పోలీసుల ఆధీనంలో ఉన్న కంటెయినర్‌ని పట్టుకునేందుకు శక్తివేల్‌ వేసిన ప్లాన్‌.. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్‌ బ్లాక్‌.. సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. 

ఇక ద్వితియార్థం మొత్తం భారీ యాక్షన్‌ సన్నివేశాలలతో ఆసక్తికరంగా సాగుతుంది. శక్తివేల్‌ ప్లాష్‌బ్యాక్‌ ఆకట్టుకుంటుంది.  అయితే హీరో హీరోయిన్ల లవ్‌స్టోరీ మాత్రం సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అంతగా కుదరలేదు. అలాగే రా ఏజెంట్స్‌ చేసే  ఆపరేషన్స్‌ కూడా మరింత థ్రిల్లింగ్‌గా సాగితే బాగుండేది అనిపిస్తుంది.   చివరి గంట మాత్రం భారీ యాక్షన్‌, ట్వీస్టులతో కథనం పరుగులు పెడుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ట్రైన్‌ యాక్షన్‌ సీన్‌ అదిరిపోతుంది. ఇదే కథ, స్క్రీన్‌ప్లేతో స్టార్‌ హీరో చేస్తే మాత్రం.. ఫలితం మరోలా ఉండేది. తెలుగులో పెద్దగా ప్రమోషన్స్‌ చేసుకోకపోవడం కూడా కొంతమేర మైనస్సే.  స్పై యాక్షన్‌ థ్రిల్లర్స్‌ ఇష్టపడేవాళ్లకు ‘లీడర్‌’ నచ్చుతుంది. 

ఎవరెలా చేశారంటే.. 
 శక్తివేల్‌ పాత్రకు శరవణన్‌ న్యాయం చేశాడు. రా ఏజెంట్‌ మాదిరే స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు సీరియస్‌ లుక్‌ని మెంటేన్‌ చేశాడు. యాక్షన్‌ సీన్లలో కూడా బాగానే నటించాడు. ఇక మీరాగా పాయల్‌ రాజ్‌పుత్‌ తెరపై కనిపించేది కాసేపే అయినా తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆండ్రియా, లాల్, శ్యామ్, అమృత అయ్యర్‌, వీటీవీ గణేష్‌, బాహుబలి ప్రభాకర్‌తో పాటు మిగిలన నటీనటులు తమ పాత్రల పరిధిమేర బాగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. జీబ్రాన్‌ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. వేంకటేష్‌ సినిమాటోగ్రఫీ బాగుంది.ఎడిటింగ్‌ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

Rating:
Advertisement
 
Advertisement
Advertisement