వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తన ప్రియురాలు, మోడల్, సామాజికవేత్త అయిన బెట్టినా ఆండర్సన్‌తో వైట్‌హౌస్ హాలిడే పార్టీలో నిశ్చితార్థం చేసుకున్నారు.
ఈవిషయాన్ని వైట్‌హౌస్‌లో నిర్వహించిన ప్రీ-క్రిస్మస్ వేడుకల సందర్భంగా ట్రంప్ జూనియర్ తెలియజేశారు. ఇప్పటికే రెండు సార్లు నిశ్చితార్థం చేసుకున్న ఈయనకు ఇది మూడో నిశ్చితార్థం కావడం గమనార్హం. వేడుకలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు అనేక మంది ప్రభుత్వ అధికారులు, ప్రముఖ రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
తనకు ఎస్ చెప్పిన ప్రియురాలికి 47 ఏళ్ల జూ. ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఇది అత్యంత మరపురాని వారాంతం. జీవిత ప్రేమను వివాహం చేసుకోబోతున్నాను. నేను ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతురాలిని, ధన్యవాదాలు,” అంటూ 39 ఏళ్ల బెట్టీ తన సంతోషాన్ని ప్రకటించారు.
బెట్టినా ఆండర్సన్ ఎవరు?
బెట్టినా ఆండర్సన్ దాతృత్వవేత్తలు హ్యారీ లాయ్ ఆండర్సన్ జూనియర్, ఇంగర్ ఆండర్సన్ కుమార్తె. ఆమె పామ్ బీచ్ సామాజిక మరియు దాతృత్వ వర్గాలలో బాగా ప్రసిద్ధి చెందింది. ఆమె ఆడ్రీ గ్రస్ స్థాపించిన హోప్ ఫర్ డిప్రెషన్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు న్యాయవాది. ఫ్లోరిడాకు చెందిన పరిరక్షణ చొరవ ప్రాజెక్ట్ పారడైజ్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే పామ్ బీచ్ కౌంటీ అక్షరాస్యత కూటమితో క్రమం తప్పకుండా స్వచ్ఛందంగా పాల్గొంటుంది.
ఈ జంట దాదాపు ఒక సంవత్సరం పాటు కలిసి ఉన్నారని సమాచారం. గత నెలలో జరిగిన వ్యాపారవేత్త కుమార్తో వివాహానికి హాజరై ఉదయపూర్‌లో సందడి చేశారు.
ట్రంప్ జూనియర్ గతంలో వెనెస్సా ట్రంప్‌ను వివాహం చేసుకున్నాడు. 12 ఏళ్ల తరువాత 2018లో వారి విడాకులు తీసుకున్నారు. వీరికి. ఐదుగురు పిల్లలు ఉన్నారు
ఈ తర్వాత, ట్రంప్ జూనియర్ 2018లో మాజీ ఫాక్స్ న్యూస్ హోస్ట్ కింబర్లీ గిల్‌ఫోయిల్‌తో డేటింగ్ ప్రారంభించాడు. 020లో నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ పెళ్లి దాకా రాలేదు. అయితే వారి సంబంధం 2024 చివరిలో ముగిసింది. 2024లో ఆండర్సన్, జూ. ట్రంప్ బంధం వెలుగులోకి వచ్చింది.
BREAKING NEWS:
President Trump just announced at the White House that his son @DonaldJTrumpJr and his girlfriend Bettina Anderson are getting married! They just got engaged.
Congratulations to them both. pic.twitter.com/psb38nTGla— Laura Loomer (@LauraLoomer) December 16, 2025
">


