Chevella road accident Updates..
చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశం
- చేవెళ్ల బస్సు ప్రమాదంపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశం
- ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన
- ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి
- మీర్జాగూడ ప్రమాదం కలచివేసింది.
- మృతుల కుటుంబాలను ఆదుకుంటాం
- ప్రభుత్వ పరిహారంతోపాటు సాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం
- ఆర్టీసీ ఇన్సూరెన్సును కూడా అందిస్తాం
- బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చే చర్యలు చేపడతాం
గ్రీన్ ట్రిబునల్‌లో ఉండటం వల్ల రోడ్డు విస్తరణ ఆలస్యం
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
- చేవెళ్లలో బస్సు ప్రమాదం జరిగింది
- ఈ ప్రమాదంలో మొత్తం 19మంది మంది మృతి చెందారు
- ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి,పీఎం హాస్పిటల్‌కు తరలించాం
- మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది
- కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు
- ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు
- గ్రీన్ ట్రిబునల్‌లో ఉండటం వల్ల రోడ్డు విస్తరణ ఆలస్యం అయ్యింది
- మూడు రోజుల క్రితం దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది
- కొద్దిరోజుల్లో రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయి
- కానీ అనుకోని విధంగా ఈ ప్రమాదం జరిగింది
చేవెళ్ల బస్సు ప్రమాదంతో భారీ ట్రాఫిక్ జామ్
- చేవెళ్ల బస్సు ప్రమాదంతో భారీ ట్రాఫిక్ జామ్
- రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-బీజాపూర్ హైవేపై స్తంభించిన వాహనాలు
- చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి
చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ఆమె ప్రార్థించారు. ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.
కేసు నమోదు..
- మీర్జాగూడ ప్రమాద ఘటనపై కేసు నమోదు..
- బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు.
- ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ గుర్తింపు.
- మహారాష్ట్రకు చెందిన ఆకాశ్ కాంబ్లేగా గుర్తించారు.
- ప్రమాదంలో బస్సు డ్రైవర్ దస్తగిరి(38) మృతి.
ఆలూరు నుంచి వాహనాల మళ్లింపు
- మీర్జాగూడ దగ్గర బస్సు ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్.
- చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో స్తంభించిన ట్రాఫిక్.
- ఆలూరు నుంచి వాహనాల మళ్లింపు.
- ఆలూరు-చేవెళ్ల మీదుగా హైదరాబాద్‌కు మళ్లింపు.
మంత్రి పొన్నం ఎక్స్‌గ్రేషియా ప్రకటన..
- ఇప్పటి వరకు 19 మంది మృతి చెందారు.
- బస్సు ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం ఆదేశిస్తుంది.
- గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందిస్తున్నాం.
- రోడ్డు విస్తరణను ఎవరు అడ్డుకుంటున్నారో అన్ని బయటకు వస్తాయి.
- ఘటనపై రాజకీయం చేసేందుకు ఇది సమయం కాదు.
- బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.
- మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు ఎక్స్‌గ్రేషియా
- క్షతగాత్రులకు రెండు లక్షల పరిహారం.
కాసేపట్లో ఘటనా స్థలానికి సీఎం రేవంత్..
- స్పాట్‌కు చేరుకున్న ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
- ఘటనా స్థలికి చేరుకున్న ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి.
- కాసేపట్లో చేరుకోనున్న రవాణా మంత్రి పొన్నం
- తీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాద్‌కు తరలిస్తున్న అధికారులు..
- కొనసాగుతున్న సహాయక చర్యలు.
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం.
తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ కామెంట్స్..
- రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసింది.
- ఈ ప్రమాదంలో మహిళలు, పిల్లలు సహా 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
- నా ఆలోచనలు, ప్రార్థనలు తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలతో ఉన్నాయి.
- ఈ దుఃఖ సమయంలో వారికి ఓదార్పు లభిస్తుందని ఆశిస్తున్నాను.
- ప్రమాదంలో గాయపడిన వారికి నా సానుభూతిని అందిస్తున్నాను.
- వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
చేవెళ్ల ఘటనపై సెక్రటేరియట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- ప్రమాద వివరాలు - అధికారుల మధ్య సమన్వయం చేయనున్న కంట్రోల్ రూమ్.
- ప్రమాద సమాచారం కోసం
- AS: 9912919545
SO: 9440854433 నంబర్లను సంప్రదించాలని కోరిన ప్రభుత్వం
ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తీవ్ర దిగ్బ్రాంతి..
- ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి
- చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న మంత్రి
- అవసరమైన వారందరినీ హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందించాలని ఆదేశాలు.
- ఉన్నతాధికారులంతా తక్షణమే ఆసుపత్రికి వెళ్లాలని మంత్రి ఆదేశం
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర విచారం
- క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం.
- ప్రమాదానికి గల కారణాలపై ఆరా, దిగ్భ్రాంతి
- సీఎం ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం సహాయక చర్యలు వేగం.
- బాధితులకు న్యాయం చేస్తాం.
- క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్స అందిస్తుంది.
ఎంపీ డీకే అరుణ తీవ్ర దిగ్భ్రాంతి..
- ప్రమాదంలో 19 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరం
- ఈ దుర్ఘటన వార్త తీవ్రంగా కలిచివేసింది
- మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా
- క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలి
- ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- ప్రమాద ఘటనపై స్పందించిన కిషన్ రెడ్డి.
- మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
- గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
- ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
మంత్రి శ్రీధర్ బాబు దిగ్భ్రాంతి..
- బస్సు ప్రమాద దుర్ఘటనపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి.
- జిల్లా కలెక్టర్, పోలీస్, ఇతర విభాగాల ఉన్నతాధికారులను అప్రమత్తం చేసిన మంత్రి
- ప్రమాదం జరిగిన తీరును, క్షతగాత్రుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
- వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించాలని ఉన్నతాధికారులను ఆదేశం
- క్షతగాత్రులకు చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించాలని ఆదేశం.
- ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు
- గాయపడిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్న హామీ.
- క్షతగాత్రులకు సంబంధించిన పూర్తి సమాచారం కుటుంబ సభ్యులకు తెలియజేసే ఏర్పాట్లు చేయాలని ఆదేశం
మృతుల కుటుంబాలను ఆదుకోవాలి: కేసీఆర్
ప్రమాదంపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కేటీఆర్ సంతాపం..
ప్రమాదంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులు మృతి చెందడంచ, పలువురు తీవ్రంగా గాయపడటం పట్ల ఆయన సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని, మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం, ఖానాపూర్ స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందడం అత్యంత బాధాకరం.
మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.
పలువురు తీవ్రంగా గాయపడటం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను.
ప్రభుత్వం తక్షణమే స్పందించి వెంటనే…— KTR (@KTRBRS) November 3, 2025
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి..
బస్సు ఘోర ప్రమాదంపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చేవెళ్ళేలో జరిగిన రోడ్డు ప్రమాదంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డవారికి తగిన వైద్య చికిత్సలు చేయాలని సూచించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మృతులను తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.
సీఎం రేవంత్ విచారం..
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులకు సూచించారు. మంత్రులు ఘటనా స్థలానికి చేరుకోవాలని సూచించారు.
👉మరోవైపు... మీర్జాగూడలో ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన సంబంధించి వివరాలు, కారణాలపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మాట్లాడారు. అలాగే, క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు మంత్రి పొన్నం సూచించారు. ఆర్టీసీ అధికారులు ఘటన స్థలానికి వెళ్లాలని మంత్రి ఆదేశించారు.
👉ఇదిలా ఉండగా.. మీర్జాగూడ వద్ద తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మూడు జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
👉ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు హైదరాబాద్‌లోని పలు కళాశాలల్లో చదువుతున్నట్లు సమాచారం. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి.. తిరిగి నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.


