సాక్షి, హైదరాబాద్: ఫ్రీలాంచ్ ఆఫర్ పేరుతో 300 కోట్లు మోసం చేసిన కాకర్ల శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. చెన్నైలో అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. హైదరాబాద్‌కు తరలించారు. ఫ్రీలాంచ్ ఆఫర్ పేరిట ఇంటి కొనుగొలు దారుల నుంచి డబ్బులు వసూలు చేసిన శ్రీనివాస్.. ఇళ్లను ఇవ్వకుండా మోసం చేశారు. ఈడీ కేసు నమోదుతో ఆయన పరారైన శ్రీనివాస్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దాని మేనేజింగ్ డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్, అనుబంధ సంస్థలపై PMLA, 2002 కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ప్రీలాంచ్ స్కీమ్ పేరిట గృహ కొనుగోలుదారులను మోసం చేసిన కేసులో అరెస్టై.. బెయిల్ మీద బయటకు వచ్చిన శ్రీనివాస్ పరారయ్యారు. ఎట్టకేలకు ఆయన్ని చెన్నైలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.


