ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. నదిలో పడిన బస్సు | Uttarakhand: Bus Falls Into Alaknanda River | Sakshi
Sakshi News home page

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. నదిలో పడిన బస్సు

Jun 26 2025 12:34 PM | Updated on Jun 26 2025 12:53 PM

Uttarakhand: Bus Falls Into Alaknanda River

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన బస్సు.. అలకనంద నదిలోకి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. 10 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రుద్ర ప్రయాగ్‌ జిల్లా ఘోల్తీర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ఉన్నట్లు సమాచారం. పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో నది పొంగిపొర్లుతుంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. యుద్ధ ప్రాతిపదికన సహాయక, రక్షణ చర్యలు చేపడుతున్నాయని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.

 


 

 

Advertisement
 
Advertisement
Advertisement