పిల్లికి ఇంటి ధృవీకరణ పత్రం?.. నవ్వులు పూయిస్తున్న దరఖాస్తు! | Cat Kumar applied residential certificate in bihar | Sakshi
Sakshi News home page

పిల్లికి ఇంటి ధృవీకరణ పత్రం?.. నవ్వులు పూయిస్తున్న దరఖాస్తు!

Aug 11 2025 7:13 PM | Updated on Aug 11 2025 7:51 PM

Cat Kumar applied residential certificate in bihar

పాట్నా: బీహార్ రాష్ట్రం మరోసారి విచిత్రమైన ఘటనతో వార్తల్లో నిలిచింది. రోహ్తాస్ జిల్లాలో ‘క్యాట్‌ కుమార్‌’ అనే పేరుతో ఒక పిల్లికి నివాస ధృవీకరణ పత్రం సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేయడం సంచలనంగా మారింది. ఈ దరఖాస్తులో తండ్రి పేరు క్యాటీ బాస్‌,తల్లిపేరు కటియా దేవిగా పేర్కొనడం గమనార్హం.

జూలై 29 రోహ్తాస్ జిల్లా నస్రిగంజ్ బ్లాక్ అటిమిగంజ్ గ్రామ నివాసి రైట్‌ టూ పబ్లిక్‌ సర్వీస్‌ డొమైన్‌లో తన పిల్లికి ఇంటి సర్టిఫికెట్‌ కావాలని ధరఖాస్తు చేశారు. ధరఖాస్తులో పిల్లి ఫోటో, ఇమెయిల్, ఫోన్ నంబర్ వివరాలు సైతం వెల్లడించారు. దీంతో జిల్లా కలెక్టర్ ఉదితా సింగ్ ఆదేశాల మేరకు నస్రిగంజ్ రెవెన్యూ అధికారి కౌశల్ పటేల్ కేసు నమోదు చేశారు. నస్రిగంజ్ పోలీస్ స్టేషన్‌లో తన పిల్లికి ఇంటి అడ్రస్‌ కోసం హౌస్‌ సర్టిఫికెట్‌ జారీ చేయాలని ఆర్‌టీపీఎస్‌ డొమైన్‌లో అప్లయి చేసుకున్న అజ్ఞాత వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే, ఈ దరఖాస్తును ప్రభుత్వ వ్యవస్థను అపహాస్యం చేయడానికి చేసిన ప్రయత్నంగా అధికారులు భావిస్తున్నారు.

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై వివాదం నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఇటీవల ‘డాగ్ బాబు’, ‘డాగేష్ బాబు‌’ పేరుతో నివాస ధృవీకరణ పత్రాల కోసం ధరఖాస్తు చేసుకోవడం చర్చాంశనీయంగా మారింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement