బెంగళూరు ట్రాఫిక్‌ కష్టాలు.. ప్రధాని మోదీకి చిన్నారి లేఖ వైరల్‌ | 5 year old Bengaluru girl writes to PM Modi to fix traffic woes | Sakshi
Sakshi News home page

బెంగళూరు ట్రాఫిక్‌ కష్టాలు.. ప్రధాని మోదీకి చిన్నారి లేఖ వైరల్‌

Aug 11 2025 5:22 PM | Updated on Aug 11 2025 5:31 PM

5 year old Bengaluru girl writes to PM Modi to fix traffic woes

 బెంగళూరు మెట్రో ఎల్లో లైన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా'రోడ్డు చాలా దారుణంగా ఉంది. దయచేసి సహాయం చేయండి' అంటూ ఐదేళ్ల చిన్నారి చేతితో రాసిన విజ్ఞప్తి ప్రజల దృష్టిని ఆకర్షించింది . నెట్టింట తీవ్ర చర్చకు దారి దీసింది.

బెంగళూరు నివాసి అభిరూప్ కుమార్తె ఆర్య, నగరంలోని దీర్ఘకాలిక ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించమని కోరుతూ ప్రధానమంత్రికి ఒక చిన్న లేఖ రాసింది. “నరేంద్ర మోదీ జీ, ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. మేము పాఠశాలకు , కార్యాలయానికి ఆలస్యంగా వెళ్తాము. రోడ్డు చాలా దారుణంగా ఉంది. దయచేసి సహాయం చేయండి” అని ఆమె రాసింది.

 చిన్నారి లేఖను తండ్రి అభిరూప్  ఎక్స్‌లో షేర్‌ చేశారు. ప్రధాని బెంగళూరును పర్యటన సందర్భంగా. నా 5 ఏళ్ల అమ్మాయి దీనిని చివరకు ట్రాఫిక్‌ను సరిదిద్దే అవకాశంగా భావిస్తోంది" అని క్యాప్షన్  ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ త్వరగా వైరల్ అయింది, నాలుగు లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి.  దీంతో నెటిజన్లు కూడా ఆమె మద్దతుగా స్పందించారు.మరికొంతమంది బెంగళూరు ట్రాఫిక్‌  కష్టాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “కోరమంగళ నుండి ఇందిరానగర్ వరకు ఉన్న రోడ్ల కారణంగా అధ్వాన్నం.  అటునుంచి వెళ్లాలంటేదాదాపు చచ్చినంత పని.. నేను రూ.3 లక్షలు ఆదాయపు పన్ను చెల్లిస్తాను. అయినా మనకు  లభించేది యమపురికి దారుల్లాంటి రోడ్లు అంటూ మండిపడ్డారు. మరోవైపు  ఒక యూజర్‌ ముంబైలో శబ్ద కాలుష్యం గురించి  15 సంవత్సరాల క్రితం తన కుమార్తె రాసిన లేఖను గుర్తు చేసుకున్నారు.  ఆగస్టు 11 నుండి ఉదయం 6:30 గంటలకు బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ ప్యాసింజర్ సర్వీసులు ప్రారంభమైనాయి. కర్ణాటక మెట్రో ప్రాజెక్టు నిధులలో 87శాతం అందిస్తుందని,చ, 2030 నాటికి బెంగళూరులో 220 కి.మీ నెట్‌వర్క్‌  పూర్తవుతుందని సీఎం సిద్ధరామయ్య  హామీ ఇచ్చారు.

 ఇదీ చదవండి: బాల అమితాబ్‌ గుర్తున్నాడా? ఇపుడు రూ. 200 కోట్ల కంపెనీకి అధిపతి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement