
1970లలో యువ అమితాబ్ బచ్చన్ పాత్రలో ఇంటింటా గుర్తుండిపోయే పేరు బాలీవుడ్ ఐకానిక్ చిత్రాలైన ‘దీవార్’, ‘సీతా ఔర్ గీత’ ‘మజ్‌బూర్’లలో అద్భుతంగా నటించి ప్రేక్షక ఆదరణ పొందాడు. అతను మరెవ్వరో కాదు 100కి పైగా హిందీ చిత్రాల్లో నటించిన బాల నటుడు అలంకార్ జోషి. మాస్టర్ అలంకార్‌గా అందరి దృష్టినీ ఆకర్షించిన అలంకార్ జోష్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారో తెలుసా?
100కి పైగా హిందీ చిత్రాలలో నటించిన బాల నటుడు అలంకార్ జోషి. దీవార్ (1975), మజ్బూర్ (1974), సీతా ఔర్ గీత (1972) వంటి క్లాసిక్ చిత్రాల్లో నటించి బాల నటుడుగా ఆకట్టుకున్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం బాల్య నటుడుగా అంతటి గుర్తింపు తెచ్చుకున్న అలంకార్ మరాఠీ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ పెద్దగా ఫలితం లభించలేదు. నాలుగు హిందీ సినిమాలు, రెండు టీవీ సీరియల్స్ , మినీ సీరియల్స్ చేశాడు.కానీ వచ్చవన్నీ చిన్న పాత్రలే కావడంతో తన కెరీర్‌ను పూర్తిగా మార్చేసుకున్నాడు. అమెరికాకు మకాం మార్చి సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్ చదివాడు. తరువాత 1996లో తన సొంత టెక్ సంస్థను స్థాపించాడు. పలు నివేదికల ప్రకారం రూ. 200 కోట్ల సంస్థకు అధిపతి కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రముఖ నటి పల్లవి జోషి అలంకార్ జోషి సోదరి.
ప్రస్తుతం కుమార్తె అనుజా జోషి ఇప్పుడు హాలీవుడ్‌లో కెరీర్‌ను కొనసాగిస్తోంది. ‘హలో మినీ’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. కుమారుడు ఆశయ్ సంగీతాన్ని అభ్యసిస్తున్నాడు, మరో కుమార్తె కూడా యాక్టింగ్‌లో ప్రవేశించేందుకు సిద్ధపడుతోంది.
ఇదీ చదవండి: ‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు