నిశీధిలో మృత్యువు విసిరిన అగ్నిపాశం.. దావానలమై కబళించింది. నిలువెల్లా దహించింది. కన్నీటి కాష్టాన్ని మిగిల్చింది. గుండెలను చిదిమేసింది. మార్కాపురం బస్సు దహనం ఘటనలో మృతుల కుటుంబాలది ఒక్కొక్కరిదీ ఒక్కోగాథ.
బతుకుదెరువు కోసం ఊరికాని ఊరు వెళ్లి తిరుగు పయనంలో సమిథలైన వారి నేపథ్యాన్ని చూస్తే ప్రతి హృదయం కదిలిపోతోంది. పొంగుకొస్తున్న దుఃఖంతో విలవిల్లాడుతోంది.


