సాక్షి,కర్నూలు : కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారు జామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు (నంబర్ DD01 N9490) కర్నూలు ప్రజానగర్‌కు చెందిన శంకర్ పల్సర్ బైక్ ఢీకొట్టింది. బైక్ ఢీకొట్టిన తర్వాత బస్సు దాదాపు 300 మీటర్లు లాక్కెళ్లింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయి. ప్రయాణికులు తేరుకునేలోపే భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది.
కర్నూలు జిల్లా బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన,సురక్షితంగా ఉన్న ప్రయాణికుల వివరాలు :
బస్సు ప్రమాద ఘటనలో మృతుల వివరాలు:
1. జె. ఫిలోమిన్ బేబీ (64)
2. కిషోర్ (64)
3. ప్రశాంత్ (32)
4. ఆర్గా బందోపధ్యాయ (23)
5. యువన్ శంకర్ రాజా (22)
6. మేఘనాథ్ (25)
7. ధాత్రి (27)
8. అమృత్ కుమార్ (18)
9. చందన మంగ (23)
10. అనూష (22)
11. గిరి రావు (48)
12. కేనుగు దీపక్ కుమార్ (24)
13. జి. రమేష్
14. జి అనూష
15. మనిత
16. కేశనాథ్
17. సంధ్యారాణి
18. కర్రీ శ్రీనివాస రెడ్డి
19. పంచాల శివశంకర్ (ద్విచక్ర వాహనదారుడు)
20. బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన ఒకరి పేరు తెలియాల్సి ఉంది.
సురక్షితంగా ఉన్న ప్రయాణికులు:
శ్రీలక్ష్మి, జస్విత (8), అభీరా (1.8)
కపర్ అశోక్ (27)
అశ్విన్ రెడ్డి
ఆకాశ్
జయంత్ కుశ్వాల్ – మధ్యప్రదేశ్ (హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు)
పంకజ్ ప్రజాపతి
శివా
గ్లోరియా ఎల్సా సామ్ – బెంగళూరు
చారిత్ (21)
మొహమ్మద్ ఖిజర్ (51)
తరుణ్ (27) – బస్సులో ఎక్కకముందే ప్రయాణం రద్దు చేసుకున్నారు
గాయపడిన ప్రయాణికులు:
మన్నెంపల్లి సత్యనారాయణ (27), తండ్రి ఎం. రవి – సత్తుపల్లి, ఖమ్మం జిల్లా
బడంత్ర జయసూర్య (24), తండ్రి సుబ్బరాయుడు – మియాపూర్, హైదరాబాద్
అండోజ్ నవీన్ కుమార్ (26), తండ్రి కృష్ణాచారి – హయత్‌నగర్, హైదరాబాద్
సరస్వతి హారిక (30), తండ్రి రంగరాజు – బెంగళూరు
నెలకుర్తి రమేష్ (36) – దత్తలూరు మండలం, నెల్లూరు జిల్లా
ముసలూరి శ్రీహర్ష (25) – నెల్లూరు జిల్లా
పునుపట్టి కీర్తి (28) – ఎస్.ఆర్. నగర్, హైదరాబాద్
వేణుగోపాల్ రెడ్డి (24) – తెలంగాణ
ఎం.జి. రామరెడ్డి – తూర్పు గోదావరి జిల్లా
ఘంటసాల సుబ్రమణ్యం – కాకినాడ, ఆంధ్రప్రదేశ్
గుణ సాయి – తూర్పు గోదావరి జిల్లా
డ్రైవర్ల వివరాలు
1.లక్ష్మయ్య, పల్నాడు జిల్లా – ప్రధాన డ్రైవర్. సంఘటన సమయంలో బస్సు నడుపుతున్నారు. ప్రమాదం తర్వాత సంఘటనా స్థలం నుంచి పారిపోయారనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం లక్ష్మయ్య పోలీసుల అదుపులో ఉన్నారు. 2.శివనారాయణ, ప్రకాశం జిల్లా – స్పేర్ డ్రైవర్. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. విచారణ కొనసాగుతోంది.
ప్రయాణికుల రాష్ట్రాలవారీగా:
• తెలంగాణ రాష్ట్రం – 6
• ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం – 11
• మధ్యప్రదేశ్ – 1
• కర్ణాటక రాష్ట్రం – 4
మరో ముగ్గురు ఏ రాష్ట్రానికి చెందినవారు తెలియాల్సి ఉంది.


