నలుగురు మృతి, 21 మందికి గాయాలు
హథ్రాస్: ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్ జిల్లాలో గురువారం సాయంత్రం చోటుచేసుకున్న బస్సు ప్రమాదంలో నలుగురు చనిపోగా 21 మంది గాయపడ్డారు. అలీగఢ్ నుంచి హథ్రాస్ వైపు వెళ్తున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సును అలీగఢ్–ఆగ్రా హైవేపైనున్న సమామాయి గ్రామ సమీపంలో ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 ఏళ్ల బాలుడు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 21 మందిని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సు డ్రైవర్ బైక్‌ను తప్పించేందుకు ప్రయతి్నంచిన క్రమంలో అదుపుతప్పి ట్యాంకర్‌ను ఢీకొట్టినట్లు చెబుతున్నారు.
ట్రక్కును ఢీకొట్టిన డబుల్ డెకర్ బస్సు..
యూపీలోని ఉన్నావ్‌లో బుధవారం అర్ధరాత్రి ఆగ్రా–లక్నో ఎక్స్‌ప్రెస్‌వే పైన ప్రైవేట్ డబుల్ డెకర్ బస్సు, కూరగాయలతో వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. అనంతరం డివైడర్ మీదుగా దూసుకెళ్లి రోడ్డు పక్కన గుంతలో పడిపోయింది. హసన్‌పూర్‌లో జరిగిన ఈ ప్రమాదంలో బస్సు లోని 60 మందికి గాను 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమీప గ్రామస్తులు అక్కడికి చేరుకుని, బస్సు అద్దాలు పగులగొట్టి, ప్ర యాణికులను బయటకు లాగారు. పోలీసులు వచ్చి తీవ్రంగా గాయపడిన కొందరిని లక్నోకు తరలించారు. బస్సు మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.


