breaking news
Tanker collided
-
స్కూల్ బస్సు, ట్యాంకర్ ఢీ
భూత్పూర్ (దేవరకద్ర): బడి ముగించుకుని ఆడుతూ పాడుతూ సాయంత్రం ఇంటికి వెళ్తున్న విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.. ఏం జరి గిందో తెలియదు.. పెద్ద శబ్ధం.. అద్దాలు పగిలిపోయి గాజుపెంకులు కళ్లకు తగులుకుంటూ వెళ్లాయి. భయాందోళనలతో ఒకటే అరుపులు కేకలు.. కానీ ఎవరికీ ఏం కాలేదు.. సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.. ఇంతకు ఏం జరిగిందంటే భూత్పూర్ మండలం అమి స్తాపూర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం స్కూల్ బస్సును ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. రెండు వాహనాల వేగం బాగానే ఉండటంతో స్కూల్ బస్సు డ్రైవర్ సుల్తాన్‌కు తీవ్రగాయాలయ్యాయి. పిల్లలంతా వెనకసీటుల్లో కూర్చోవడంతో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదానికి కారణాలు.. మిషన్ భగీరథ పైప్‌లైన్ పనుల్లో భాగంగా రోడ్డును సగం తొలగించి పైప్‌లైన్ పనులు చేపట్టారు. పనులు ఇంకా పూర్తికాక నిర్వాహకులు రోడ్డును డైవర్షన్ చేశారు. దీంతో వాహనాలు ఒకే దారిలో వెళ్లాల్సి వస్తోంది. అయితే మంగళవారం సాయంత్రం మహబూబ్‌నగర్ నుంచి భూత్పూర్ వైపుకు వస్తున్న హిరా మోడల్ స్కూల్ బస్సును ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ సుల్తాన్ సీటు లో ఇరుక్కుపోయాడు. దారిగుండా వెళ్తు న్న వాహనదారులు, గ్రామస్తులు వెంట నే డ్రైవర్‌ను బయటకు లాగి అంబు లెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ పంకజ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు సంఘటన జరిగిన వెంటనే డ్రైవర్‌కు రక్తగాయాలు కావడంతో అంకుల్.. అంటూ కేకలు పెట్టారు. గమనించిన అమిస్తాపూర్ వాసులు విద్యార్థులను బస్సులోంచి దించి సముదాయించారు. ప్రమాదం వార్త తెలుసుకున్న విద్యార్ధుల తల్లిదండ్రులు సైతం వెంటనే అక్కడికి వచ్చి పిల్లలను అక్కున చేర్చుకున్నారు. ఎవరికీ ఎలాంటా గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆందోళనకు గురైన విద్యార్థులు నోటీసులు జారీ చేశాం పనులు త్వరితగతిన పూర్తికాకపోవడంతో గతంలో పలుమార్లు ‘సాక్షి’లో కథనాలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తుచేస్తూ అధికారులు, కాంట్రాక్టర్ పనితీరును తప్పుపట్టారు. ఇదిలాఉండగా ఈ విషయంపై ఎస్ఐ శ్రీనివాస్ స్పందించారు. గతంలో రోడ్డు డ్రైవర్షన్ను త్వరగా తొలగించాలని ఆర్అండ్బీ, మిషన్ భగీరథ అధికారులకు చెప్పామని, వారు పట్టించుకోకపోవడంతో పలుమార్లు నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిపారు. ఇకనైనా పనులు వేగంగా చేసి డైవర్షన్ తొలగించాలని కోరారు. -
మమ్మీ టాటా..
వారికున్నది ఒక్కగానొక్క కూతురు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. రోజులాగే బడికెళ్లింది. మధ్యాహ్నం అన్నం తినిపించేందుకు నాన్న టీవీఎస్ మోపెడ్‌లో స్కూలు వద్దకు వెళ్లి పాపను ఇంటికి తీసుకొచ్చాడు. భోజనం చేశాక టాటా మమ్మీ అంటూ అమ్మకు వీడ్కోలు పలికి నాన్న వెంట టీవీఎస్‌లో స్కూలుకు బయలు దేరింది. మార్గమధ్యంలో ట్యాంకర్ మృత్యుశకటంలా దూసుకొచ్చి వీరు వెళ్తున్న మోపెడ్‌ను ఢీకొంది. క్షణాల్లో ఆ చిన్నారి మృత్యు కౌగిట్లోకి వెళ్లిపోయింది. కన్నవారికి కడుపుకోత మిగిలింది. ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని ముద్దనూరు రోడ్డులో న్యూకాలనీలో నివాసముంటున్న ఎన్. చంద్రశేఖర్, ఉమల ఏకైక కుమార్తె సాయికీర్తన(10). చంద్రశేఖర్ ఐసీఎల్ కర్మాగారంలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. సాయికీర్తన(10) మహాత్మానగర్ కాలనీలోని శ్రీ విజయవాణి హైస్కూల్లో ఐదవ తరగతి చదువుతోంది. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లింది. మధ్యాహ్నం భోజనం కోసం తండ్రి చంద్రశేఖర్ పాపను పాఠశాల నుంచి ఇంటికి తీసుకొచ్చాడు. పాపతో కలిసి అమ్మా..నాన్నలు భోంచేశారు. పాఠశాలకు సమయం కావడంతో అమ్మకు టాటా టాటా చెప్పి తండ్రితో కలిసి టీవీఎస్ మోపెడ్‌లో స్కూలుకు బయలు దేరింది. ముద్దనూరురోడ్డులో మహాత్మానగర్ కాలనీకి వెళుతుండగా వెనుక నుంచి ట్యాంకర్ వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో తండ్రి ఎగిరి కింద పడ్డాడు. వెనుక కూర్చున్న సాయికీర్తన తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. విషయం తెలుసుకున్న సీఐ పీటీ కేశవరెడ్డి, ఎస్ఐ లక్ష్మినారాయణలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మున్సిపల్ చైర్మన్ ముసలయ్య సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఒక్కగానొక్క బిడ్డను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది.త ండ్రి చంద్రశేఖర్, తల్లి ఉమలు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసునమోదు చేసుకోని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టర్ కోరకు చిన్నారి మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.