సాక్షి, హైదరాబాద్: పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద శనివారం ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడడంతో అందులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో ఆంబులెన్స్‌లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.



