సాక్షి, కర్నూలు: కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైకర్ సహా 20 మంది మృతి చెందినట్టు సమాచారం. అయితే.. బస్సు, బైక్ ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ప్రమాదం సందర్బంగా బైక్‌ను బస్సు దాదాపు 300 మీటర్లు లాక్కెళ్లిపోయింది. ఈ ఘటనలో ప్రమాదానికి కారణమైన బైకర్ శంకర్ చనిపోయాడు. శంకర్‌ను కర్నూలు మండలం ప్రజానగర్‌కు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు.
కాగా, శివశంకర్ మరణంతో అతని తల్లి యశోద, కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ బిడ్డ ఇలా మృతి చెందడం పట్ల విలపిస్తోంది. గ్రానైట్, పెయింటింగ్ పనులు చేసే శివశంకర్ నిన్న తెల్లవారుజామున డోన్ నుంచి బయలుదేరి ఇంటికి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. బస్సు ముందుభాగంలోకి బైక్ వెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం కారణంగా బస్సులోనే పలువురు సజీవ దహనం అయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ఉండగా.. వారిలో ఇద్దరు చిన్నారులు, పది మంది మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు 20 మంది చనిపోయినట్టు సమాచారం. ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రమాదంలో నల్లగొండకు చెందిన అనూషా రెడ్డి మృతి..
ఇదిలా ఉండగా.. ఘటనా స్థలానికి ఫొరెన్సిక్ బృందం చేరుకుంది. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగిస్తున్నారు. అలాగే, ఘటన స్థలానికి రవాణా శాఖ అధికారులు చేరుకున్నారు. బైక్‌ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వచ్చాయని అధికారులు తెలిపారు. కావేరి ట్రావెల్స్ పేరిట ఒడిశాలో రిజిస్ట్రేషన్ చేసి బస్సు నడుపుతున్నారు. 2018 మే 2న రిజిస్ట్రేషన్ చేశారు.

తల్లీకూతుళ్లు మిస్సింగ్..
ఈ బస్సుకు 2030 ఏప్రిల్ 30 వరకు టూరిస్ట్ పర్మిట్ జారీ అయ్యింది. ప్రమాదానికి గురైన బస్సు ఫిట్‌గా ఉంది. 2027 మార్చి 31 వరకు ఫిట్‌నెట్ ఉంది. 2026 ఏప్రిల్ 20 వరకు బస్సుకు ఇన్సూరెన్స్ ఉంది. బైక్‌ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వచ్చాయి. అన్ని కోణాల్లో పూర్థి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు నివేదిక మేరకు భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.



