తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు మూడు బస్సు ప్రమాదాలు | Private Travels Bus Crashes Into Divider In Tirupati District | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు మూడు బస్సు ప్రమాదాలు

Apr 11 2026 7:42 AM | Updated on Apr 11 2026 8:38 AM

Private Travels Bus Crashes Into Divider In Tirupati District

సాక్షి, సూర్యాపేట జిల్లా: ​కోదాడ బైపాస్‌ వద్ద జాతీయ రహదారి 65పై లారీని వెనుక నుంచి ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ఢీకొట్టింది. ​హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ​ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ​ఈ ఘటనలో 16 మందికి  గాయాలు కాగా.. వెంటనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ​డ్రైవర్ నిద్ర మత్తుతోనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. ​ప్రమాద సమయంలో డోర్ రాకపోవడంతో వెనక ఉన్న అత్యవసర డోర్ నుంచి బస్సు ప్రయాణికులు దిగారు.

కామారెడ్డి జిల్లా: భిక్నూర్ మండలం రామేశ్వరంపల్లి జాతియ రహదారిపై అంబులెన్స్- బస్సుఢీకొన్నాయి. ఘటనలో అంబులెన్‌లో ఉన్న సలేహా బాను (63), డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. పేషెంట్ భర్త సైఫుల్లా ఖాన్ (76)కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ  మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తిరుపతి జిల్లా: ప్రైవేట్ బస్సుకు తృటిలో ఘోర ప్రమాదం జరిగింది. 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పూతలపట్టు –నాయుడుపేట ప్రధాన రహదారిలోని పాకాల మండలం నేండ్రగుంట సమీపంలో ఘటన జరిగింది. బెంగళూరు నుంచి తిరుపతికి వస్తుండగా ఘటన జరిగింది. వేగంగా వస్తున్న ట్రావెల్స్ బస్సు లారీని తప్పించబోయి అవతలి వైపు రోడ్డు దూసుకెళ్లి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం నుంచి బయటపడటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు పాకాల సీఐ చిన్న గోవిందు, ఎస్‌ఐ తరుణ్.. . ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement