తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తా:అమర్‌నాథ్
విశాఖ లీగల్ : మాజీమంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు ఆరునెలల జైలుశిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ వరలక్ష్మి గురువారం తీర్పు వెలువరించారు. 2016 ఏప్రిల్ 17న ప్రత్యేక రైల్వేజోన్ సాధన కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అమర్‌నాథ్ ఆమరణ దీక్ష చేపట్టగా, ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీనిని ఆత్మహత్యాయత్నంగా పోలీసులు అప్పట్లో కేసు నమోదుచేశారు. ఆ కేసులో విచారణ పూర్తిచేసిన న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది. అయితే, ఈ తీర్పుపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు.


