హెల్మెట్‌ పట్టీ పెట్టుకోకపోయినా చలానా! | cyberabad traffic police helmet strap rule drive fines | Sakshi
Sakshi News home page

హెల్మెట్‌ పట్టీ పెట్టుకోకపోయినా చలానా!

Apr 11 2026 7:37 AM | Updated on Apr 11 2026 1:12 PM

cyberabad traffic police helmet strap rule drive fines

రెండ్రోజుల్లో 173 మంది వాహనదారులకు విధింపు 

సాక్షి, హైదరాబాద్‌: హెల్మెట్, హెల్మెట్‌ స్ట్రాప్‌ (పట్టీ) పెట్టుకోకుండా వాహనాలు నడుపుతున్న వారిపై సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల ప్రత్యేక దృష్టి సారించారు. గత రెండ్రోజుల్లో కమిషనరేట్‌ పరిధిలో నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌లో హెల్మెట్‌ పెట్టుకోకుండా వాహనాలు నడుపుతున్న 3,072 మంది వాహనదారులపైన ట్రాఫిక్‌ పోలీసులు చలానాలు విధించారు. అలాగే హెల్మెట్‌ స్ట్రాప్‌ పెట్టుకోకుండా వాహనాలు నడుపుతున్న 173 మంది వాహనదారులపైన కూడా చలానాలు విధించారు. 

ఆయా ఉల్లంఘనదారు లకు పోలీసులు హెల్మెట్, హెల్మెట్‌ స్ట్రాప్‌ పెట్టుకోకుండా వాహనాలు నడపడం వలన జరిగే ప్రమాదాలను వివరించారు. ద్విచక్ర వాహనదారులందరూ తప్పకుండా హెల్మెట్, హెల్మెట్‌ స్ట్రాప్‌ పెట్టుకొని వాహనాలు నడుపుతూ సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరుకోగలరని పోలీసులు సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ డీసీపీ రంజన్‌ రతన్‌ కుమార్, అదనపు డీసీపీ హనుమంతరావు, ఇతర ట్రాఫిక్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement