కర్ణాటక ఆర్టీసీ బస్సు బోల్తా.. | KSRTC Bus Escapes From Major Accident At Kurnool, More Details Inside | Sakshi
Sakshi News home page

కర్ణాటక ఆర్టీసీ బస్సు బోల్తా..

Nov 29 2025 8:53 AM | Updated on Nov 29 2025 10:00 AM

KSRTC Bus Escapes From Accident At Kurnool

కర్నూలు:  కర్ణాటక  బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కర్నూల్‌ జిల్లాలోని తుగ్గలి సమీపంలో కర్ణాటక ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. బస్సు వేగం సమానంగా ఉండటంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో 26 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. ఈ రోజు(శనివారం, ,నవంబర్‌ 29) ఉదయం  బస్సు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. 

స్టీరింగ్ రాడ్ విరిగిపోయి పొలాల్లోకి దూసుకెళ్లి  బోల్తా పడిండి  బస్సు. మంత్రాలయం నుండి బెంగళూరుకు వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అంతకుముందు కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో  ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం కోటేకల్‌ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement