పెరవలి: మండలం ఖండవల్లి వద్ద మోటార్ సైకిళ్లను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. పెరవలి ఎస్‌ఐ ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు తాడేపల్లిగూడేనికి చెందిన కపిలేశ్వరపు రామకృష్ణ అతని భార్య ఆదిలక్ష్మి, కుమారుడు హర్షతో కలసి మోటార్ సైకిల్‌పై పెనుగొండ మండలం రామన్న పాలెం వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టటంతో వారు ముగ్గురు రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు.
మహిళకు ముఖంపై తగలటంతో తీవ్ర రక్తస్రావం అయ్యిందని, మిగిలిన ఇద్దరికి గాయాలయ్యాయని చెప్పారు. వీరు ముగ్గురిని వైద్యం కోసం తణుకులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించామని, ప్రాణ హాని లేదని వైద్యులు తెలిపారన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.