వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ పరిశీలకుల నియామకం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ పరిశీలకుల నియామకం

Mar 14 2026 7:59 AM | Updated on Mar 14 2026 7:59 AM

సాక్షి, అమలాపురం: అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ పరిశీలకులను నియమించారు. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వీరిని నియమించినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రామచంద్రపురం నియోజకవర్గానికి కర్రి నాగిరెడ్డి, ముమ్మిడివరానికి చెల్లుబోయిన శ్రీనివాసరావు, అమలాపురానికి కటకంశెట్టి విజయధర్మ ఆదిత్యకుమార్‌, రాజోలుకు కర్రి పాపారాయుడు, పి.గన్నవరానికి చింతపాటి శ్రీనివాసరాజు, కొత్తపేటకు పాటి శివకుమార్‌, మండపేటకు ఒంటెద్దు వెంకన్న నాయుడులను నియమించారు.

మొల్లమాంబకు ఘన నివాళి

అమలాపురం రూరల్‌: వాల్మీకి రామాయణాన్ని అచ్చ తెలుగులో రచించిన ఖ్యాతి మహా కవయిత్రి మొల్లమాంబకే దక్కుతుందని జేసీ టి.నిశాంతి పేర్కొన్నారు. మొల్లమాంబ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా బీసీ వెల్ఫేర్‌ అధికారి ఆధ్వర్యంలో మొల్ల చిత్రపటానికి నివాళులర్పించారు. మొల్లమాంబ జయంతిని రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహించుకో వడం హర్షణీయమన్నారు. 16వ శతాబ్దానికి చెందిన ఆమె కడప జిల్లా గోపవరంలో జన్మించారని, మహిళా సాధికారతకు, భక్తి సాహిత్యానికి ఆమె ప్రతీక అని జేసీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ జి.మమ్మీ బీసీ కార్పొరేషన్‌ డైరెక్టర్లు, శాలివాహన సంఘ ప్రతినిధులు జిల్లాస్థాయి అధికారులు కలెక్టరేట్‌ పరిపాలన అధికారి కె.కాశీ విశ్వేశ్వరరావు, రెవెన్యూ సిబ్బంది భరత్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement