డివైడర్‌ను ఢీకొని బోల్తాపడిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు | Bus accident at Khammam district | Sakshi
Sakshi News home page

డివైడర్‌ను ఢీకొని బోల్తాపడిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు

Jun 8 2026 7:01 AM | Updated on Jun 8 2026 10:44 AM

Bus accident at Khammam district

సాక్షి,ఖమ్మం: పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జిపై ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి ఓ  ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు మితిమీరిన వేగంతో బ్రిడ్జిని ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 36మంది ప్రయాణికుల్లో 26మంది ప్రయాణికులకు గాయాల‌య్యాయి.

 ప్రమాదంతో అప్రమత్తమైన తోటి వాహనదారులు, సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన చోటు చేసుకోగా.. ప్రమాదానికి గురైన బస్సు కేవీఆర్‌ ట్రావెల్స్‌ బస్సుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement