సాక్షి,అమరావతి: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు గురువారం అర్ధరాత్రి దాటాక కర్నూలు శివారులో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణాలపై ఏపీ హోంమంత్రి అనిత అధికారిక ప్రకటన చేశారు.(Kurnool Bus Fire Accident)
కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ..‘వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19మంది మృతి చెందగా.. 27మంది ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడ్డ ఆరుగురిలో ముగ్గురికి ప్రాక్చర్లు అయ్యాయి. ప్రమాదం ఎలా జరిగిందో తేల్చేందుకు నాలుగు బృందాలు పనిచేస్తున్నాయి. మృతదేహాలను గుర్తించేందుకు 16మంది ఫోరెన్సిక్ నిపుణులను ఏర్పాటు చేసినట్లు’ వెల్లడించారు.



