నెల్లూరులో టూరిస్టు బస్సు బోల్తా | Tourist Bus Accident At Nellore District, While Heading To Chennai And Several Injured | Sakshi
Sakshi News home page

నెల్లూరులో టూరిస్టు బస్సు బోల్తా

May 28 2026 7:52 AM | Updated on May 28 2026 10:15 AM

Tourist Bus Accident At Nellore District

సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద చోటుచేసుకుంది. ఓ టూరిస్టు బస్సు అదుపు తప్పి బోల్తా పడిపోయింది. ఈ క్రమంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడటంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, డ్రైవర్‌ నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

వివరాల ప్రకారం.. నెల్లూరు హైవేపై ఏలూరు నుండి చైన్నై వైపు వెళ్తున్న టూరిస్ట్‌ బస్సు గురువారం ఉదయం బోల్తా పడింది. నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ జంక్షన్ వద్ద అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.  ప్రమాదం సమయంలో బస్సులో సుమారు 38 మంది పెద్దలు, ఐదుగురు ప్రయాణిస్తున్నారు. అయితే, డ్రైవర్‌ నిద్ర మత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి పోలీసులు, సహాయక బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement