సాక్షి,కర్నూలు: కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం ప్రమాదానికి కారణమైన బస్సును రోడ్డుపై నుంచి తొలగిస్తుండగా క్రేన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో క్రేన్ ఆపరేటర్‌కు గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు,పోలీసులు క్రేన్ ఆపరేటర్‌ను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కావేరి ట్రావెల్ బస్సు కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ బస్సు పల్సర్ బైక్‌ను ఢీకొట్టి మంటలు జరిగాయి. ప్రమాదం జరిగిన తర్వాత బస్సు ఆగకుండా 300 మీటర్లు ముందుకు ఈడ్చుకుని వెళ్లడంతో ఘోరం జరిగింది.బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 19మంది మరణించినట్లు ఏపీ హోంమంత్రి అనిత అధికారికంగా ప్రకటించారు.



