ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో సోమవారం రాత్రి బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, 38 మంది గాయపడ్డారు. ఇండోర్ - మోవ్ మధ్య సిమ్రోల్ భేరు ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. జిల్లా యంత్రాంగం తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెండాడు. తొమ్మిది మంది క్షతగాత్రులను ఇండోర్‌లోని ఎంవై ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
Madhya Pradesh CM Mohan Yadav tweets, "The accident caused by a bus overturning between Indore and Mhow, resulting in the death of three citizens, is extremely heartbreaking. Instructions have been given to provide Rs 2 lakh each to the immediate family members of the deceased… pic.twitter.com/382VQuhF8M
— ANI (@ANI) November 3, 2025
బస్సు ఓంకారేశ్వర్ నుండి ఇండోర్‌కు వెళుతుండగా పెద్ద గుంతలో బోల్తా పడిందని జిల్లా కలెక్టర్ శివం వర్మ మీడియాకు తెలిపారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని, డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ ప్రమాదంపై ‘ఎక్స్’లో స్పందిస్తూ, ఇది హృదయ విదారక ఘటనగా అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.
ఇది కూడా చదవండి: కోయంబత్తూరు ఘటన: సినీ ఫక్కీలో నిందితుల అరెస్ట్


