మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు | Another private travel bus catches fire in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు

Jun 18 2026 11:20 PM | Updated on Jun 19 2026 7:42 AM

Another private travel bus catches fire in Andhra Pradesh

అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో రేగుపాలెం వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.యలమంచిలి బైపాస్ వద్ద పెద్ద ప్రమాదం తప్పింది. భువనేశ్వర్ నుంచి చెన్నై వెళ్తున్న తులసి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో వెంటనే ప్రయానికులంతా బస్సు నుంచి దిగిపోయారు. దాంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అందరూ బయటపడ్డారు. బస్సు యలమంచిలి బైపాస్ చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

మంటలు వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే, డ్రైవర్ , సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది.  కాగా ఈ ప్రమాదంలో తులసీ ట్రావెల్స్ బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనతో రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు.  

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement