హైదరాబాద్: వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న సమయంలో పెద అంబర్‌పేట వద్ద బస్సు టైర్ల కింద నుంచి పొగలు వ్యాపించాయి. బస్సు ఓవర్ హీట్‌తో టైర్ల కింద నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే రోడ్డుపైనే నిలిపేశాడు.
బస్సులో 25 మంది ప్రయాణికులు ఉండగా, వారిని దించేశారు. అయితే ఆ తర్వాత ఆ ప్రయాణికుల్ని వేమూరి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం పట్టించుకోలేదు. ప్రయాణికుల్ని కనీసం పట్టించుకోకపోవడంతో వారు తీవ్ర చలిలోనే పడిగాపులు కాస్తూ రోడ్డుపై నిలబడిపోయారు.
కాగా, కొన్ని రోజుల క్రితం వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లాలో ఈ దుర్ఘటనలో మొత్తం 20 మంది మృత్యువాత పడ్డారు. బస్సులోని 19 మంది ప్రయాణికులతో పాటు బైకర్ సైతం మరణించారు.


