Shubhanshu Shukla ‘నిన్నటినుంచి తెగ నిద్రపోతున్నానట’ | Ive Been Sleeping A Lot Shubhanshu Shukla Message From Space | Sakshi
Sakshi News home page

Shubhanshu Shukla ‘నిన్నటినుంచి తెగ నిద్రపోతున్నానట’

Jun 26 2025 2:35 PM | Updated on Jun 26 2025 4:11 PM

 Ive Been Sleeping A Lot Shubhanshu Shukla Message From Space

భారత వ్యోమగామి 39 ఏళ్ల భారత వైమానిక దళ పైలట్, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా, ఆక్సియం-4 మిషన్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోకి ఎగిసిన కొన్ని  గంటల తర్వాత , కక్ష్య నుండి తన  తొలి వ్యక్తిగత సందేశాన్ని  పంపించారు. గాల్లోకి పంపినప్పుడు గొప్పగా అనిపించలేదు అంటూనే అంతరిక్షంలో తన ఫీలింగ్‌ను పంచుకున్నారు. 

"అంతరిక్షం నుంచి అందరికీ నమస్కారం.  తోటి వ్యోమగాములతో ఇక్కడ ఉండటం  చాలా ఆనందంగా ఉంది. వావ్, ఎంత ఆనందం.. అద్భుతమైన ప్రయాణం. లాంచ్‌ప్యాడ్‌లోని క్యాప్సూల్‌లో ఇప్పుడిప్పుడే నడక నేర్చిన చిన్నారిలా ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నా..ఎలా కదలాలో, ఎలా తినాలో..  ఎలా నియంత్రించుకోవాలో తెలుసుకుంటున్నా’ అంటూ శుభాన్షు తన అనుభవాలను సందేశంలో పంచుకున్నారు. అలాగే స్పేస్‌క్రాఫ్ట్‌లో తన మొదటి గంటల్లో, జీరో గ్రావిటీకి అలవాటు పడుతూ, తన అనుభవం గురించి  మాట్లాడారు.  నిన్నటి నుండి చాలా నిద్రపోతూనే ఉన్నానట  అంటూ చెప్పుకొచ్చారు.

చదవండి: డిజిటల్‌ యాప్స్‌ బంద్‌, జీపే కూడా తీసేసా: సానియా మీర్జా సోదరి సంచలన పోస్ట్‌

కాగా  భారత వ్యోమగామి రాకేశ్‌శర్మ తరువాత తాజా ప్రయోగంతో 41 ఏండ్ల తర్వాత రోదసిలోకి వెళ్తున్న రెండో భారతీయుడిగా శుభాన్షు రికార్డు సృష్టిస్తున్నారు. ఐఎస్‌ఎస్‌లోకి వెళ్తున్న తొలి భారతీయుడు కూడా శుభాన్షు కావడం విశేషం.మాజీ నాసా వ్యోమగామి , గత మూడు మిషన్లలో అనుభవజ్ఞుడైన కమాండర్ పెగ్గీ విట్సన్ , మిషన్ నిపుణులు హంగేరీకి చెందిన టిబోర్ కాపు, పోలాండ్‌కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నివ్స్కీలతో పాటు యాక్స్-4 మిషన్‌లో ఉన్న నలుగురు వ్యోమగాములలో  శుక్లా ఒకరు.

చదవండి: మూడు నెలల ముందే పదేళ్ల జీవితానికి ప్లాన్‌ : కానీ అంతలోనే!

 

Advertisement
 
Advertisement
Advertisement