చంద్రుడి పై ఇళ్ల స్థలాలు అమ్మే వాళ్లను చూశాం. కాని ఇప్పుడు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) చంద్రుడిపై మనుషులు శాశ్వతంగా నివసించేలా ఒక సరికొత్త ‘మూన్ బేస్’ (Moon Base) ప్రాజెక్ట్‌ను రెడీ చేస్తోంది. ఔరా! అవును. ప్రస్తుతం శాస్త్రవేత్తలు చంద్రుడి యొక్క ’దక్షిణ ధృవం’ పై పరిశోధనలు చేస్తున్నారు. అక్కడ ఉన్న చీకటి లోయలలో భారీగా ‘మంచు రూపంలో నీరు’ దాగి ఉందని గుర్తించారు.
ఆ మంచును కరిగించి తాగే నీరుగా, శ్వాసించే ఆక్సిజన్ గా మార్చడమే కాకుండా భవిష్యత్తులో అంగారక గ్రహానికి వెళ్లే రాకెట్లకు ఇంధనంగా కూడా వాడుకోవచ్చని నాసా ప్లాన్ చేస్తోంది! రాబోయే ‘ఆర్టెమిస్’ మిషన్ల ద్వారా మళ్లీ మనుషులను చంద్రుడిపైకి పంపేందుకు నాసా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. 2050 నాటికి వ్యోమగాములు చంద్రుడిపై ఇళ్లు (Pressurized Habitats) నిర్మించుకుని, అక్కడ నెలల తరబడి నివసించేలా ఈప్రాజెక్ట్ సాగనుంది. అంటే ఫ్యూచర్‌లో స్పేస్ సైంటిస్టులు భూమి మీద కాకుండా.. చందమామపై ఉంటూనే ఆఫీస్ వర్క్ చూసుకుంటారన్నమాట!


