ప్రాణాయామంతో... ఆస్తమాకు చెక్‌ | 5 to10 Min Daily Pranayama | Sakshi
Sakshi News home page

ప్రాణాయామంతో... ఆస్తమాకు చెక్‌

Aug 8 2026 7:36 AM | Updated on Aug 8 2026 7:36 AM

5 to10 Min Daily Pranayama

1 అనులోమ–విలోమ (నాడీ శోధన్రపాణాయామం)

చేసే విధానం...
పద్మాసనం లేదా సుఖాసనంలో నిటారుగా కూర్చోండి. ∙ఎడమ చేతిని మోకాలిపై ఉంచండి. 

కుడి చేతి బొటనవేలితో కుడి ముక్కు రంధ్రం మూసి, ఎడమ ముక్కు ద్వారా నెమ్మదిగా శ్వాస పీల్చండి. 

ఇప్పుడు ఉంగరం వేలితో ఎడమ రంధ్రం మూసి, కుడి రంధ్రం ద్వారా శ్వాసను నెమ్మదిగా వదలాలి. 

అదే కుడి రంధ్రం ద్వారా శ్వాస పీల్చి, ఎడమ రంధ్రం ద్వారా వదలాలి. 

ఇలా 5–10 నిమిషాలు చేయాలి.

ప్రయోజనాలు...
ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడటానికి తోడ్పడుతుంది. ∙ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. ∙శ్వాసపై 
నియంత్రణ పెరుగుతుంది.

2. భ్రమరిప్రాణాయామం... చేసే విధానం...

సుఖంగా కూర్చోండి. కళ్లు మూసుకుని లోతుగా శ్వాస పీల్చండి. ∙శ్వాసను నెమ్మదిగా వదులుతూ ‘మ్‌...మ్‌... అనే తుమ్మెద శబ్దంలా చేయాలి. ∙5–10 సార్లు చేయాలి.

ప్రయోజనాలు... ∙మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ∙ఒత్తిడి తగ్గి శ్వాస సులభంగా అనిపిస్తుంది.

నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.

3. దీర్ఘ శ్వాస... చేసే విధానం..
ముక్కు ద్వారా నెమ్మదిగా లోతుగా శ్వాస పీల్చండి. ∙΄÷ట్ట స్వల్పంగా బయటకు రావాలి. ∙నెమ్మదిగా శ్వాసను పూర్తిగా వదలండి. ∙5–10 నిమిషాలు చేయండి.

ప్రయోజనాలు...
ఊపిరితిత్తులకు గాలి బాగా చేరడంలో సహాయపడుతుంది. ∙శ్వాసకోశ కండరాలకు విశ్రాంతి లభిస్తుంది.

జాగ్రత్తలు...
ఆస్తమా అటాక్‌ వచ్చినప్పుడుప్రాణాయామం చేయవద్దు. 

శ్వాసను బలవంతంగా ఆపడం (కుంభకం) చేయకండి. 

కపాలభాతి, భస్త్రిక వంటి వేగంగా చేసేప్రాణాయామాలను  వైద్యుడు లేదా అనుభవజ్ఞుడైన యోగా గురువు ఆధ్వర్యంలోనే చేయాలి. 

ఖాళీ కడుపుతో లేదా భోజనం చేసిన 3 గంటల తర్వాత చేయడం మంచిది. 

తల తిరగడం, ఛాతీ బిగుసుకు΄ోవడం, శ్వాస ఇబ్బంది పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే  వెంటనే ఆపి వైద్యుడిని 
సంప్రదించండి.

అనిత పాతర్ల, యోగా ట్రైనర్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement