రెచ్చిపోతున్న కాల్‌ మనీ కీచకులు.. రూ.5కోట్లకు వడ్డీ రూ.25కోట్లు | Call Money Racket Continues in Vijayawada | Sakshi
Sakshi News home page

రెచ్చిపోతున్న కాల్‌ మనీ కీచకులు.. రూ.5కోట్లకు వడ్డీ రూ.25కోట్లు

Jun 15 2026 5:49 PM | Updated on Jun 15 2026 7:13 PM

Call Money Racket Continues in Vijayawada

సాక్షి,కృష్ణ: విజయవాడలో కాల్‌మనీ ఆగడాలు కొనసాగుతున్నాయి.రూ.5 కోట్లు ఇచ్చి రూ.21 కోట్లు వడ్డీ కట్టించుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. మరో రూ.5 కోట్లు కట్టాలంటూ వ్యాపారికి కాల్‌మనీ ముఠా బెదిరింపులకు దిగింది. దీంతో ఆందోళనకు గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినప్పటికీ ఆమెకు న్యాయం జరగలేదు.

దీంతో తన న్యాయం చేయాలని బాధితురాలు హోంమంత్రి అనితను కలిశారు. తనపై కాల్‌మనీ ముఠా దాడి చేసిందని ఆరోపించారు. ప్రామిసరీ నోట్‌పై సంతకాలు చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కాల్‌మనీ వ్యాపారులు వెనిగళ్ల హర్షవర్ధన్‌, హరినాథ్‌లకు..టీడీపీ పెద్దల అండదండలున్నాయని చెప్పారు. మంత్రి కొల్లు రవీంద్ర, రఘురామకృష్ణరాజు, దేవినేని చందు అండతో కాల్‌మనీ ముఠా రెచ్చిపోతుందని బాధితురాలు పోయారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement