కీబోర్డ్‌లో 'ఎఫ్‌, జే' కీలపై గీతలు ఎందుకుంటాయో తెలుసా? | Why F And J Keys Have Bumps On Keyboard: Touch Typing Reason Explained | Sakshi
Sakshi News home page

కీబోర్డ్‌లో 'ఎఫ్‌, జే' కీలపై గీతలు ఎందుకుంటాయో తెలుసా?

Aug 8 2026 3:52 AM | Updated on Aug 8 2026 11:35 AM

Why F And J Keys Have Small Bumps On Keyboard

మనలో చాలామంది ప్రతిరోజూ కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ కీబోర్డ్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే, కీబోర్డ్‌లోని ‘ఎఫ్‌’, ‘జె’ అనే రెండు కీస్‌పై చిన్న ఎత్తుగా ఉండే గీతలు లేదా బంప్స్‌ ఉంటాయి. ఇవి ఎందుకుంటాయో ఎపుడైనా ఆలోచించారా? ఈ గీతలను టచ్‌ టైపింగ్‌ సౌకర్యం కోసం తయారుచేశారు.

కీబోర్డ్‌ వైపు చూడకుండానే వేగంగా టైప్‌ చేయడానికి ఈ గీతలు ఎంతగానో ఉపయోగపడతాయి. టైపింగ్‌ నేర్చుకునే సమయంలో చేతి వేళ్లను కీబోర్డ్‌ మధ్య వరుసలో ఉంచడాన్ని ‘హోమ్‌ రో’ అంటారు. ఎడమ చేతి చూపుడు వేలిని ‘ఎఫ్‌’  పై, కుడి చేతి చూపుడు వేలిని‘జె’పై ఉంచడానికి ఈ గీతలు సూచికగా పనిచేస్తాయి.

అంతేకాదు టైప్‌ చేసేటప్పుడు ప్రతిసారీ కీబోర్డ్‌ వైపు చూడాల్సిన అవసరం లేకుండా, వేళ్ల స్పర్శ ద్వారా చూపుడు వేళ్లు సరైన స్థానంలో ఉన్నాయో లేదో గుర్తించవచ్చు. వేళ్లు సరైన స్థానంలో ఉండటం వల్ల సమయం ఆదా అయి, టైపింగ్‌ వేగం పెరుగుతుంది. స్క్రీన్‌ నుంచి దృష్టి మళ్లించకుండా టైప్‌ చేయడం వల్ల కళ్లకు విశ్రాంతి లభిస్తుంది. చూపు లేనివారు లేదా కీబోర్డ్‌ చూడకుండా టైప్‌ చేయాలనుకునే వారి కోసం జాన్‌ ఇ బార్ట్‌లీ అనే మహిళ ఈ టెక్నిక్‌ను రూపొందించి.. 2002లో పేటెంట్‌ పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement