ఆపద వస్తే తెలియాల్సిన అంశాలు ఇవే.. | What If You Die Today, Here Are The Essential Financial Steps To Protect Your Family Future, Read Story Inside | Sakshi
Sakshi News home page

ఆపద వస్తే తెలియాల్సిన అంశాలు ఇవే..

Aug 6 2026 9:05 AM | Updated on Aug 6 2026 10:02 AM

What If You Die Today Financial Steps to Protect Your Family Future

కుటుంబ భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ నిత్యం శ్రమిస్తారు. బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్ పాలసీలు, స్టాక్స్ రూపంలో రకరకాల పెట్టుబడులు పెడుతుంటారు. కానీ, ‘ఒకవేళ ఉన్నపళంగా మీకేదైనా అనుకోని ప్రమాదం జరిగితే.. మీ సంపాదన, పెట్టుబడుల వివరాలన్నీ మీ కుటుంబానికి తెలుసా?’ అని ప్రశ్నించుకుంటే మెజారిటీ సమాధానం ‘నో’.

భారతదేశంలో లక్షల కోట్ల రూపాయలకు పైగా డబ్బు అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్లుగా (బాధితులు లేదా వారసులు క్లెయిమ్ చేయని నిధులు) బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్, పీఎఫ్ ఖాతాల్లో మూలుగుతోందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెచ్చిన ‘ఉద్గమ్’ పోర్టల్ వంటి ఖాతాల జాబితాను పరిశీలిస్తే ఈ నిజం తెలుస్తుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా దూరమైనప్పుడు సరైన సమాచారం లేక ఎంతోమంది ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి.

ఈ సమస్య తలెత్తకుండా నివారించడానికి ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన విషయాలు..

మాస్టర్ ఫైనాన్షియల్ బ్లూప్రింట్

మీకున్న అన్ని రకాల బ్యాంకు ఖాతాలు, మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు, డీమ్యాట్ అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, లైఫ్/హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు, లాకర్లు, రియల్ ఎస్టేట్ పత్రాలు, రుణాల వివరాలతో ఒక స్పష్టమైన జాబితాను తయారు చేయాలి. వీటిని ఒక సురక్షిత ఫైలులో లేదా ఎన్‌క్రిప్టెడ్ డిజిటల్ వాల్ట్‌లో భద్రపరిచి ఆ వివరాలను జీవిత భాగస్వామితో పంచుకోవాలి.

నామినేషన్లను అప్‌డేట్ చేయడం

ప్రతి ఆర్థిక ఖాతాకు నూరు శాతం నామినేషన్ పూర్తి చేయాలి. వివాహం, పిల్లల జననం వంటి జీవితంలో వచ్చే మార్పులకు అనుగుణంగా నామినీల వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి.

స్పష్టమైన విల్లు రాయడం

చట్ట ప్రకారం నామినీ కేవలం నిధులను స్వీకరించే సంరక్షకుడు (ట్రస్టీ) మాత్రమే, పూర్తి హక్కుదారు కాకపోవచ్చు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా మీ ఆస్తులు మీ వారసులకు చెందేలా ఒక స్పష్టమైన విల్లు తయారుచేయడం శ్రేయస్కరం.

కుటుంబంలో ఆర్థిక పారదర్శకత

ఆర్థిక అంశాలను రహస్యంగా ఉంచే అలవాటును పక్కనపెట్టి ఇంట్లో వీటి గురించి చర్చించండి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్, చార్టర్డ్ అకౌంటెంట్ లేదా న్యాయవాది కాంటాక్ట్ వివరాలు కుటుంబ సభ్యులకు తెలిసి ఉండాలి.

కేవలం సంపదను సృష్టించడమే కాదు.. ఆ సంపద అనుకోని ఆపద సమయంలో కుటుంబానికి అండగా నిలిచేలా జాగ్రత్త పడటమే నిజమైన ఆర్థిక ప్రణాళిక. మీ కష్టార్జితం అనాథ కాకుండా ఉండాలంటే నేడే మీ ఆర్థిక బ్లూప్రింట్‌ను సిద్ధం చేసి కుటుంబంతో పంచుకోండి.

ఇదీ చదవండి: మళ్లీ నింగినంటుతున్న బంగారం ధరలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement