మండూకం అంటే కప్ప. ఈ ఆసనం వేసేటప్పుడు శరీరం కప్పలా కనిపిస్తుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఈ ఆసనంలో మోకాళ్లపై కూర్చొని, ముందుకు వంగి కడుపుపై ఒత్తిడి ఇస్తారు. ముఖ్యంగా జీర్ణక్రియ మెరుగుపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కప్పలా కూర్చుని, కడుపుకు మసాజ్ ఇచ్చే యోగానే మండుకాసనం.
చేసే విధానం..
ముందుగా మోకాళ్లపై వజ్రాసనంలో కూర్చోవాలి. ∙పిడికిళ్లను బిగించి నాభి దగ్గర పెట్టాలి. ∙శ్వాస విడిచేటప్పుడు ముందుకు వంగాలి. కడుపుపై ఒత్తిడి వచ్చేలా ఉంచాలి.
15–20 సెకన్లు ఉండి నెమ్మదిగా పైకి రావాలి.
జాగ్రత్తలు..
కడుపు నొప్పి / అల్సర్ ఉంటే చేయకూడదు.
గర్భిణులు చేయకూడదు. మోకాళ్ల నొప్పులు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకొని చేయాలి.
ఉపయోగాలు..
జీర్ణక్రియ మెరుగుపడుతుంది.∙గ్యాస్, అజీర్ణం తగ్గుతుంది.
కడుపు భాగం బలపడుతుంది.
ఇది డైలీ 2–3 సార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
అనిత పాతర్ల యోగా ట్రైనర్


