Shubhanshu Shukla: ఆహా... అంతరిక్షంలో గాజర్‌ హల్వా | Shubhanshu Shukla carrying to space gajar halwa and more | Sakshi
Sakshi News home page

Shubhanshu Shukla: ఆహా... అంతరిక్షంలో గాజర్‌ హల్వా

Jun 17 2025 9:41 AM | Updated on Jun 17 2025 10:02 AM

Shubhanshu Shukla carrying to space gajar halwa and more

శుభాంశు శుక్లా అంతరిక్షయాత్రకు సంబంధించిన ఆసక్తి శాస్త్రీయ విషయాలకే పరిమితం కాలేదు.‘అక్కడ ఏంతింటారు?’ లాంటివి కూడా చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు.శుక్లా తనతో పాటు భారతీయ రుచులను కూడా అంతరిక్షంలోకి తీసుకువెళ్లనున్నాడు.‘ఇస్రో’ ప్రత్యేకంగా సిద్ధం చేసిన వంటకాలు, గాజర్‌ హల్వా తీసుకువెళతాడు. 

ఈ వంటకాలను మొదట భారతదేశ గగన్‌యాన్‌ మిషన్‌ కోసం తయారుచేశారు. వాటిని ఇప్పుడు ‘యాక్సియం–4’ మిషన్‌ కోసం ఉపయోగించనున్నారు.అంతరిక్ష పరిస్థితులను తట్టుకునేలా,  మై క్రో గ్రావిటీలో తినడానికి తేలికగా, సురక్షితంగా, తాజాగా ఉండేలా ఈ  ఆహారపదార్థాలను తయారుచేశారు. భారతీయ వంటకాలను ‘యాక్సియం–4’ మిషన్‌ కోసం ఆమోదించడం అంత తేలికగా జరగలేదు.

ఇదీ చదవండి: Today tips : బొద్దింకలతో వేగలేకపోతున్నారా?

‘భారతీయ వంటకాలలో మసాలాలు అధికంగా ఉన్నందున వాటిని తీసుకువెళ్లడానికి అనుమతి లభించడం కష్టం అయింది. చివరకు కొన్ని రకాల ఆహారపదార్థాలను అనుమతించారు. తన వెంట తీసుకువెళుతున్న భారతీయ వంటకాలను తోటి వారికి రుచి చూపించాలని శుభాంశు ఉత్సాహంగా ఉన్నాడు’ అంటుంది లక్నోలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న శుక్లా సోదరి సుచి శుక్లా.

 

 

Advertisement
 
Advertisement
Advertisement