
శుభాంశు భార్య కామ్నా ఎదురుచూపులు
లక్నో: అంతరిక్షరంగంలో భారత కీర్తిపతాకను అంతర్జాతీయ అంతరిక్షకేంద్రంలో ఎగరేసి పుడమికి తిరిగొచ్చిన వ్యోమగామి శుభాంశు శుక్లా రాక కోసం లక్నోలో ఆయన కుటుంబం ఎదురుచూస్తోంది. ఈ సందర్భంగా శుక్లా సతీమణి కామ్నా మీడియాతో మాట్లాడారు. ‘‘అద్వితీయమైన ఆయన అంతరిక్ష యాత్ర ముగింపు తర్వాత కుటుంబంతో ఎప్పుడు గడుపుతారా అని మేమంతా ఎదురు చూస్తున్నాం. ఆయన లక్నోకు రాగానే ఇంటి భోజనం రుచి చూపిస్తా.
తినలేకపోయిన ఆయనకు ఎంతో ఇష్టమై న వంటకాలను కొసరి కొసరి వడ్డిస్తా’’ మా ఆరేళ్ల అబ్బాయి కియాశ్ సహా కుటుంబం మొత్తం సర దాగా గడుపుతాం’’ అని ఆయన భార్య కామ్నా చెప్పారు. ‘‘ఈయన వెళ్లిన వెంటనే నాకు ఫోన్ చేశా రు. సంభ్రమాశ్చర్యాలకు గురయ్యా. ఆయన గొంతు వినగానే ప్రాణం లేచొచ్చింది. అక్కడ ఆయన చేసిన శాస్త్రసాంకేతిక ప్రయోగాలపైనే మేమిద్దరం మాట్లాడుకున్నాం. భూమికి దూరంగా అంతెత్తులో గడపడం అసాధారణంగా ఉందని నాతో అనేవారు. అక్కడ ఉన్న ఈ 18 రోజుల్లో ఆయనతో జరిపిన ఈ ఫోన్‌కాల్ సంభాషణలు నా జీవితంలో మర్చిపోలే ను. ఆయన స్వదేశాను గమనం మా కుటుంబానికే కాదు యావత్ దేశానికి గర్వకారణం కావడం నాకెంతో నచ్చింది అని ఆమె అన్నారు.