
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా
ఐఎస్‌ఎస్‌లో అనుభవాల వెల్లడి
న్యూఢిల్లీ: ‘రక్త ప్రసరణలో వ్యత్యాసం ఏర్పడుతుంది. ముఖం ఉబ్బుతుంది, గుండె వేగం తగ్గుతుంది, వెన్నెముక సాగుతుంది, నడుము నొప్పి మొదలవుతుంది. పొట్టలోని పదార్థాలు తేలుతున్నట్లు అనిపిస్తుంది. ఆకలి అనిపించదు.. ఇవన్నీ అంతరిక్షంలోకి చేరుకున్నాక తాను ఎదుర్కొన్న సమస్యలని భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తెలిపారు. ఢిల్లీలో ఎఫ్‌ఐసీసీఐ సీఎల్‌వో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తన అంతరిక్ష అనుభవాలను పంచుకున్నారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో జీవితం మానవ సహనానికి ఒక పరీక్ష లాంటిదని అభిప్రాయపడ్డారు. అది పట్టుదల, సహనం, జట్టు స్ఫూర్తిని నేరి్పందని పేర్కొన్నారు. అంతరిక్ష యాత్రలంటే సరదాగా ఉంటాయని అందరూ భావించవచ్చు.. నిజం చెప్పాలంటే అవి అలానే ఉంటాయి కానీ, ఒకసారి సూక్ష్మ గురుత్వాకర్షణలోకి చేరుకోగానే, శరీరం తిరుగుబాటు చేస్తుందని శుభాంశు శుక్లా స్పష్టం చేశారు. శరీరం అప్పటివరకు అలాంటి వాతావరణాన్ని ఎప్పుడూ చూడకపోవడమే అందుకు
కారణమని.. అక్కడ ప్రతిదీ మారిపోతుందని వివరించారు.
ఐఎస్‌ఎస్‌లో ఉన్నప్పుడు శుభాంశు శుక్లా.. భారత ప్రధాని నరేంద్ర మోదీతో సంభాíÙంచడం తెలిసిందే. ఆ సంభాషణకు ముందు తనకు కడుపులో వికారంగా అనిపించిందని, తలనొప్పితో బాధపడ్డానని శుక్లా గుర్తు చేసుకున్నారు. వాంతులు రాకుండా మందులు వేసుకుంటే మగతగా అనిపిస్తుందని.. కాబట్టి అవి కూడా వేసుకునేందుకు వీల్లేకపోయిందని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో తన జట్టు సభ్యులు ఎంతో సహకరించారని చె ప్పారు. అంతరిక్షం నుంచి భూమిని చూసినప్పుడు.. భారతదేశాన్ని గుర్తించడం ఒక అద్భుతమైన అనుభవమని శుక్లా తెలిపారు. అంతరిక్షం నుంచి చూసినప్పు డు భారతదేశం చాలా అందంగా కనిపించిందని శుభాంశు శుక్లా ఆనందం వ్యక్తం చేశారు.