
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం( ఐఎస్‌ఎస్)లో కి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా తన చరిత్రాత్మక మిషన్ యాగ్జియం-4లో భాగంగా పలు పరిశోధను చేయనున్న సంగతి తెలిసిందే. ఆ పరిశోధనల్లో ఏటా వేలా మంది బాధపడుతున్న దీర్థకాలిక వ్యాధి మధుమేహంపై కూడా అధ్యనం చేయనున్నారట. అంతేగాదు ఒక రకంగా ఈ అధ్యయనం ఆ వ్యాధిని ఎలా నిర్వహించాలో తెలియజేయడమే గాక మధుమేహం వ్యాధిగ్రస్తుల్లో కొండంత ఆశను రేకెత్తించే అవకాశం కూడా ఉందని సమాచారం. మరీ ఆ విశేషాలేంటో చూద్దామా..!.
భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా తన యాగ్జియమ్ మిషన్4లో భాగంగా సుమారు 60కి పైగా శాస్త్రీయ ప్రయోగాల్లో పాల్గొనన్నారు. వాటిలో డయాబెటిస్ వ్యాధిపై అధ్యయనం కూడా ఉంది. ఈ వ్యాధిని ఎలా నిర్వహించొచ్చు లేదా బయటపడొచ్చు అనే దిశగా అధ్యయనాలు చేస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం ఉన్న వ్యక్తులు అంతిరిక్షంలోకి వెళ్లొచ్చా..? లేదా అనే దిశగా కూడా పరిశోధనలు చేయనుంది శుభాంశు బృందం.
ఎందుకంటే జీరో గ్రావిటీలో రక్తంలోని చక్కెర స్థాయిలపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందని మధుమేహం ఉన్న వ్యోమగాములను అంతరిక్ష కార్యకలాపాలను పూర్తిగా మినహాయించారు. ఆ నేపథ్యంలోనే ఈ యాగ్జియ-4 మిషన్ సూట్‌రైడ్ అనే పరిశోధన ప్రాజెక్టులో భాగంగా ఈ దీర్ఘకాలిక వ్యాధిపై పరిశోధన చేస్తోంది.
మధుమేహం ఉన్నవారు అంతరిక్షంలో నివశించడానికి, అక్కడి కార్యకలాపాల్లో పాల్గొనడానకి అనుకూలమా కాదా అనేదే ప్రధాన ధ్యేయం అని ఈ పరిశోధనకు సారథ్యం వహిస్తున్న డాక్టర్ మొహమ్మద్ ఫిత్యాన్ వెల్లడించారు. ఒకరకంగా ఈ పరిశోధన గురుత్వాకర్షణ ప్రభావం లేకుండా జీవక్రియను అధ్యయనం చేసే వీలు కల్పిస్తోందన్నరు. అంతేగాక ఇన్సులిన్ నిరోధకతపై కొత్త మార్గాన్ని అందిస్తుందని చెప్పారు.
ఈ పరిధనలోని ముఖ్యాంశాలు..
రెండలు వారాల మిషన్ సమయంలో ఒకరు లేదా ఇద్దరు వ్యోమగాములు కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటర్లు (CGM)లను ధరిస్తారు. ఈ పరికరాలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నిరంతరం పర్యవేక్షిస్తూ డేటాను భూమికి పంపిస్తాయి. ప్రతిక్షణం ఆ వ్యోమగాముల రీడింగ్‌లు పర్యవేక్షించడం జరుగుతుందని చెప్పారు డాక్టర్ ఫిత్యాన్. ఈ మైక్రోగ్రావిటీలో ఆరోగ్యకరమైన జీవిక్రియ ఎలా మార్పులు సంతరించుకుంటోంది తెలుసుకోవడమేగాక భవిష్యత్తులో డయాబెటిస్ ఉన్న వ్యోమగాములు ఈ సీజీఎం(CGM)లను ధరించి వెళ్లడం సురక్షితం కాదో తెలుసుకోవడంలో హెల్ప్ అవుతుందని చెప్పుకొచ్చారు.
ఈ పరిశోధన భూమిపై మారుమూల ప్రాంతాలు లేదా ఎలాంటి సదుపాయాలు లేని ప్రదేశాల్లో ప్రజలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. అలాగే ఈ పరిశోధన భవిష్యత్తు అధ్యయనాలకు మార్గం సుగమం చేస్తుందని ధీమాగా చెప్పారు. కాగా, ఈ పరిశోధన అనంతరం డయాబెటిస్ ఉన్న తొలి వ్యొమగామిని అంతరిక్షంలోకి పంపి పరిస్థితిని అంచనా వేయడం వంటి మరిన్ని పరిశోధనలు కూడా చేయనున్నట్లు ఫిత్యాన్ వెల్లడించారు.
(చదవండి: 'కన్నీళ్లు ఉప్పొంగే క్షణం': శుభాంశు తల్లిదండ్రుల భావోద్వేగం)