నేడు స్వదేశానికి శుభాంశు  | Indian Astronaut Shubhanshu Shukla returns to India to a warm welcome | Sakshi
Sakshi News home page

నేడు స్వదేశానికి శుభాంశు 

Aug 17 2025 6:00 AM | Updated on Aug 17 2025 6:55 AM

Indian Astronaut Shubhanshu Shukla returns to India to a warm welcome

ప్రధాని మోదీని  కలువనున్న వ్యోమగామి

న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో గడిపి చరిత్ర సృష్టించిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఆదివారం అమెరికా నుంచి స్వదేశానికి రానున్నారు. యాగ్జియం–4 మిషన్‌ కోసం అమెరికాలో గత ఏడాదిగా శిక్షణ పొందిన శుక్లా ముందుగా ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకుంటారు. అనంతరం, యూపీలోని సొంతూరు లక్నోకు బయలుదేరి వెళతారు. ఆ తర్వాత అక్టోబర్‌లో మొదలయ్యే గగన్‌యాన్‌ మిషన్‌ శిక్షణలో పాల్గొంటారు. 

అమెరికాలోని ఫ్లోరిడా నుంచి జూన్‌ 25న నింగిలోకి దూసుకెళ్లిన యాగ్జియం–4 మిషన్‌లోని నలుగురు వ్యోమగాముల్లో శుభాంశు శుక్లా ఒకరు. జూన్‌ 26వ తేదీ నుంచి ఐఎస్‌ఎస్‌లో పలు ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసుకుని, తిరిగి జూలై 15న భూమిపైకి చేరుకున్నారు. శనివారం శుభాంశు విమానంలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. 

‘నేను స్వదేశానికి చేరుకునేందుకు విమానంలో కూర్చు న్నప్పుడు, మిశ్రమ భావోద్వేగాలు కలిగాయి. గత ఏడాదికాలంలో నా స్నేహితులు, కుటుంబసభ్యులుగా ఉన్న అద్భుతమైన వ్యక్తులను విడిచిపెట్టాల్సి వస్తున్నందుకు ఓ వైపు బాధ, మిషన్‌ తర్వాత మొదటిసారిగా నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, దేశంలోని ప్రతి ఒక్కరినీ కలవబోతున్నందుకు మరో వైపు ఉత్సాహం ఉన్నాయి. జీవితం అంటే ఇదేనేమో అని అనుకుంటున్నాను’అని శుక్లా పేర్కొన్నారు. శుక్రవారం హూస్టన్‌లోని భారత కాన్సులేట్‌లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో శుక్లాతోపాటు వ్యోమగామిగా ఎంపికైన ప్రశాంత్‌ నాయర్‌ కూడా పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement