స్పేస్‌లోకి శుభాంశు శుక్లా.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము ఏమన్నారంటే | Narendra Modi Wishes Success To Group Captain Group Captain Shubhanshu Shukla | Sakshi
Sakshi News home page

స్పేస్‌లోకి శుభాంశు శుక్లా.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము ఏమన్నారంటే

Jun 25 2025 3:48 PM | Updated on Jun 25 2025 5:57 PM

Narendra Modi Wishes Success To Group Captain Group Captain Shubhanshu Shukla

సాక్షి,ఢిల్లీ: ఇస్రో-నాసా సంయుక్త యాక్సియం-4 మిషన్‌ కోసం అంతరిక్షంలోకి బయల్దేరిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా(Shubhanshu Shukla)కు రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ శుభాకంక్షలు తెలిపారు. 

శుభాంశు శుక్లా స్పేస్‌లోకి 1.4 బిలియన్ల మంది భారతీయుల శుభాకాంక్షల్ని,నమ్మకాల్ని, ఆకాక్షంల్ని మోసుకెళ్తున్నారని ప్రధాని మోదీ కొనియాడారు. శుభాంశు శుక్లాతో పాటు మిషన్ కమాండర్ అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, పోలాండ్‌కు చెందిన మిషన్ స్పెషలిస్ట్
స్లావోష్ ఉజ్నాన్స్కీ,హంగేరీ మిషన్ స్పెషలిస్ట్ టిబోర్ కాపులకు మోదీ శుభాంక్షలు చెప్పారు.  

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణంపై స్పందించారు. గ్రూప్ కెప్టెన్‌గా శుభాంశు శుక్లా భారత అంతరిక్ష విభాగంలో సరికొత్త రికార్డ్‌లను సృష్టించారు. అంతరిక్షంలోకి ఈ భారతీయుడి ప్రయాణం పట్ల మొత్తం దేశం ఉత్సాహంగా గర్వంగా ఉంది. శుభాంశు తన ఆక్సియం మిషన్ 4లోని అమెరికా, పోలాండ్, హంగేరీ వ్యోమగాములుతో తమదంతా ‘వసుధైవ కుటుంబం (ఒకే కుటుంబం)’గా నిరూపించారని ముర్ము అన్నారు.

భారత సంతతికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా. ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ కెప్టెన్‌గా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికా ప్రైవేట్ అంతరిక్ష సంస్థ యాక్సియమ్ స్పేస్ నిర్వహిస్తున్న Ax-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళుతున్నారు. ఈ మిషన్ ద్వారా రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టనున్న రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్రలో నిలవనున్నారు.

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement