ఇది యావత్‌దేశ లక్ష్యం: శుభాంశు శుక్లా | Shubhanshu Shukla Reflects on Space Journey and India's Growing Space Capabilities | Sakshi
Sakshi News home page

ఇది యావత్‌దేశ లక్ష్యం: శుభాంశు శుక్లా

Aug 21 2025 2:12 PM | Updated on Aug 21 2025 3:17 PM

It was Entire Mations Mission Shubhanshu Shukla

న్యూఢిల్లీ: అంతరిక్షం గురించి క్షేత్రస్థాయలో నేర్చుకునే దానికన్నా తనకు అందిన అనుభవం భిన్నమైనదని, అంతరిక్షయానం అనేది యావత్‌ దేశ లక్ష్యమని వ్యోమగామి శుభాంశు శుక్లా అన్నారు. అంతరిక్షయానాన్ని విజయవంతంగా పూర్తిచేసి, భారత్‌ చేరుకున్న వ్యోమగామి శుభాంశు శుక్లాకు యావత్‌ ప్రపంచం నుంచి అభినందనలు అందుతున్నాయి.

ఈ నేపధ్యంలో న్యూఢిల్లీలో ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా గురువారం విలేకరుల సమావేశంలో  మాట్లాడారు. భారతదేశం అంతరిక్ష సామర్థ్యాలను మరింతగా పెంపొందించుకుంటున్నదని,  ఆక్సియం-4 మిషన్‌పై  మరింతగా దృష్టిసారించదని నారాయణన్ అన్నారు. శుక్లా మాట్లాడుతూ..  క్షేత్రస్థాయిలో నేర్చుకునే దానికంటే తాను అందుకున్న అనుభవం చాలా భిన్నంగా  ఉన్నదన్నారు. భారత ప్రభుత్వానికి, ఇస్రోకు, పరిశోధకులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు.
 

2015 నుండి 2025 వరకు ఇస్రో చేపట్టిన మిషన్ల కంటే 2005 - 2015 మధ్య కాలంలో చేపట్టిన మిషన్లు రెట్టింపు సంఖ్యలో ఉన్నాయని డాక్టర్ నారాయణన్  అన్నారు. గత ఆరు నెలల్లో మూడు కీలక మిషన్లను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఆక్సియం-4 మిషన్ ప్రతిష్టాత్మకమైన మిషన్ అని, మొదటి భారతీయుడిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళి​, సురక్షితంగా తిరిగి తీసుకువచ్చిందన్నారు. 
ఈ కార్యక్రమానికి ముందు శుభాంశు శుక్లా  రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. సోమవారం ఆయన  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement