శుభాంశు రోదసియాత్ర మళ్లీ వాయిదా | Shubhanshu Shuklas Axiom 4 Mission Postponed | Sakshi
Sakshi News home page

శుభాంశు రోదసియాత్ర మళ్లీ వాయిదా

Jun 18 2025 9:53 AM | Updated on Jun 18 2025 10:15 AM

Shubhanshu Shuklas Axiom 4 Mission Postponed

న్యూఢిల్లీ: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా  రోదసియాత్ర ‘ఆక్సియం-4 మిషన్’ మరోసారి వాయిదా పడింది. ఈ ప్రయోగం జూలై 19న  జరగాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాలతో  ‘ఆక్సియం-4 మిషన్’ను జూన్ 22న నిర్వహించనున్నట్లు ‘నాసా’ పేర్కొంది. భారతదేశపు రెండవ వ్యోమగామి శుభాన్షు శుక్లాను అంతరిక్షంలోకి తీసుకెళ్లే ఆక్సియం-4 మిషన్ ప్రయోగం తరచూ వాయిదా పడుతూ వస్తోంది.

దీనికి ముందు ఫాల్కన్ 9 రాకెట్ రిపేర్  కారణంగా వాయిదా అనివార్యమయ్యింది. ఈ విషయాన్ని స్పేస్‌ ఎక్స్‌ నాడు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ఎక్స్‌లో తెలియజేసింది. పోస్ట్ స్టాటిక్ ఫైర్ బూస్టర్ తనిఖీల సమయంలో గుర్తించిన ఎల్‌ఓ ఎక్స్‌ లీక్‌ను రిపేర్  చేసేందుకు స్పేస్‌ఎక్స్ బృందాలకు అదనపు సమయం అవసరం కానున్నదని తెలిపింది. మరమ్మతు పూర్తయిన తర్వాత  తదుపరి ప్రయోగ తేదీని తెలియజేస్తామని స్పేస్‌ఎక్స్  పేర్కొంది.  అంతకుముందు ప్రయోగ ప్రాంతంలో అనుకూలమైన వాతావరణం లేని కారణంగా వాయిదా పడిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)  తెలిపింది. భారతదేశ అంతరిక్ష లక్ష్యాల​కు ఒక మైలురాయిగా ఈ మిషన్‌ నిలవనుంది. యాక్సియమ్ స్పేస్, నాసా, స్పేస్‌ఎక్స్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)ల సహకారంలో ఈ ప్రయోగం జరుగుతోంది. 

ఇది కూడా చదవండి: అది ప్రతీ భారతీయుని ఆత్మపై దాడి: ‘జీ7’లో ప్రధాని మోదీ

Advertisement
 
Advertisement
Advertisement